Breaking News

ఒకేసారి అన్నారు.. ఇప్పుడు దశలవారీ!

Published on Wed, 07/17/2024 - 05:30

సాక్షి, హైదరాబాద్‌: రుణమాఫీ సొమ్మును ఒకేసారి రైతుల ఖాతాల్లో వేస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. దశల వారీగా జమ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయలలోపు రుణాలున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. కానీ తదుపరి విడత ఎప్పుడు చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దశల వారీగా రుణమాఫీ చేయడం వలన ఇతర రైతులు ఆ సొమ్ము కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు కీలకమైన వానాకాలం సీజన్లో రైతులు కొత్తగా బ్యాంకు రుణాలు తీసుకోవడానికి కష్టం అవుతుందని అంటున్నారు. ఒకేసారి రుణమాఫీ చేస్తే కొత్త రుణాలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది.  

లక్షకు పైన ఉంటే ఎదురుచూపులే..! 
రుణమాఫీని గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మరో పద్ధతిలో చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక రైతుకు లక్షన్నర రూపాయల రుణం ఉంటే... 18వ తేదీన ఆ రైతుకు లక్ష వరకు మాఫీ చేయరు. కేవలం లక్ష రూపాయలలో పు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తారు. అంటే లక్షకు పైగా రుణాలున్నవారు ఆ తర్వాత ప్రభు త్వం విడుదల చేసే నిధుల కోసం ఎదురుచూడాల్సిందేనన్న మాట. గతంలో రుణం ఎంతున్నా ప్రభుత్వం నిర్ధారించిన మేరకు అందరికీ రుణమాఫీ జరిగేది. గత ప్రభుత్వం లక్షరూపాయల లోపు రు ణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే.

ఆ డేటా ఆధారంగానే ఈసారి 18వ తేదీన రైతులకు రుణమాఫీ చేస్తారని అంటున్నారు. మరోవైపు రేషన్‌ కార్డు వెరిఫికేషన్, పీఎం కిసాన్‌ నిబంధన ప్రకారం అనర్హులను 18వ తేదీ రుణమాఫీ సందర్భంగా ఎలా గుర్తిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. గురువారం ఒక్క రోజులోనే లక్ష లోపు రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బుధవారం సెలవు అయినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విధుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అ లాగే బ్యాంకర్లు కూడా పూర్తిస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)