Breaking News

ప్రతి మూడో ముద్ద తేనెటీగలు పెడుతున్నదే! 

Published on Sat, 05/20/2023 - 04:54

ప్రకృతిలో తేనెటీగల వంటి చిరుప్రాణులు లేక పోతే మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. మొక్కల్లో పూలు కాయలుగా మారడానికి  పరాగ సంపర్కమే కారణం. ఈ ప్రక్రియకు  ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపకరిస్తూ పంటల  ఉత్పాదనలో ఈ చిరుప్రాణులు తోడ్పడటం వల్లనే మనం మూడు పూటలా తినగలుగుతున్నాం. మనం తింటున్న ప్రతి మూడో ముద్ద ముఖ్యంగా తేనెటీగల పుణ్యమే.

తేనెటీగలు లేకపోతే ఎన్నో రకాల పంటలు పండవు. అందుకే, తేనెటీగలు  అంతరిస్తే నాలుగేళ్లలోనే మానవ జాతి  అంతరిస్తుంది అన్నాడో మహనీయుడు.  తేనెటీగల ఉసురు తీస్తున్న పురుగుమందులు, కలుపుమందులు, పచ్చదనం కొరత, వ్యాధికారక క్రిముల విజృంభణ వంటి సమస్యలకు ఇప్పుడు అదనంగా ‘వాతావరణ మార్పులు’తోడయ్యాయి. అందువల్ల కరువు, కుంభవృష్టి వంటి వాతా వరణ మార్పు ప్రభావాల  నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ తేనెటీగలను సైతం కనిపెట్టుకుని ఉండాలి.   – సాక్షి సాగుబడి డెస్క్‌  


మనం ఏం చేయగలం?  
♦ అటవీ ప్రాంతాలను నాశనం  చేయకుండా ఉండటం..  
♦ గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల మీద రకరకాల స్థానిక రకాల పూల మొక్కల్ని పెంచటం..  
♦నగరాలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాల్లో, మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో, ముఖ్యంగా రోడ్ల పక్కన ఖాళీ జాగాల్లో కూడా మొక్కలతోపాటు స్థానిక జాతుల పూల మొక్కల్ని విస్తృతంగా పెంచటం..  
♦ రసాయనిక పురుగు మందులు, కలుపు మందులు చల్లకుండా ఉండటం..  
♦తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించటం వంటి పనులను మనం చేస్తుంటే జీవవైవిధ్యం పరిఢవిల్లుతుంది. తేనెటీగల వంటి చిరు జీవులు మనుగడ సాగిస్తాయి. మనల్ని రక్షిస్తాయి.. 

తేనెటీగలు.. కొన్ని వాస్తవాలు 
♦ తేనెటీగ సగటు జీవితకాలం పనిచేసే కాలంలో సుమారు 1.5 నెలలు; పని లేని సీజన్‌లో సుమారు 2.5 నెలలు. ∙అర కిలో తేనె ఉత్పత్తికి 556 తేనెటీగలు పని చేయాల్సి ఉంటుంది.  
♦ తేనెటీగల సంతతి వసంత రుతువులో 15,000 ఉంటుంది. వేసవిలో 80,000 వరకు ఉంటుంది.  
♦ 2021లో ప్రపంచవ్యాప్తంగా సహజంగా ఉత్పత్తయిన తేనె: 1.77 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు


20,000  ప్రకృతిలో ఉన్న  తేనెటీగల జాతులు.. 

పరాగ సంపర్కానికి దోహదపడే.. అంతరించిపోయే ముప్పుఎదుర్కొంటున్న సకశేరుక (వెన్నెముక ఉన్న) జాతులు 16.9 

అంతరించిపోతున్న తేనెటీగలు, సీతాకోక చిలుకలు  వంటి అకశేరుక (వెన్నెముక లేని) జాతులు  40%

తేనెటీగలు తదితర కీటకాల పరాగసంపర్కమే ఆధారం. 

పుష్పించే అడవి మొక్కలు/చెట్లలో తేనెటీగలు/జంతువుల పరాగసంపర్కంపై ఆధారపడుతున్నవి.  90%

ప్రపంచవ్యాప్తంగా పరాగసంపర్కంపై ఆధారపడి ఉన్న ఆహార పంటలు. 75%

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)