Breaking News

క్యాట్‌లో ఐఏఎస్‌ల పిటిషన్‌: నాలుగు వారాలకు విచారణ వాయిదా

Published on Mon, 11/04/2024 - 09:39

సాక్షి,హైదరాబాద్‌: ఐఏఎస్ అధికారుల కేటాయింపుపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్‌)లో ఇవాళ( సోమవారం) విచారణ జరగింది. స్వాపింగ్, డొమిసిల్ (స్థిర నివాసం) ఆధారంగా తమ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోలేదన్న ఐఏఎస్‌ల పిటిషన్‌పై క్యాట్‌ విచారణ చేపట్టింది. అయితే ఈరోజు డీఓపీటీ కౌంటర్ దాఖలు  చేయలేదు. 

ఇక.. ఎడుగురు ఐఏఎస్ అధికారుల విడిగా కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని  ఐఏఎస్ తరుపు న్యాయవాదులు కోరారు. వచ్చే విచారణకు ఏడుగురు ఐఏఎస్‌ల కేటాయింపుపై  విడిగా  కౌంటర్లు ఫైల్ చేయాలనీ డీఓపీటీకి క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ క్యాట్ 4 వారాలకు వాయిదా వేసింది.

గత నెలలో కేటాయించిన రాష్ట్రాల్లోనే విధులు నిర్వహించాలంటూ డీవోపీటీ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు.  డీవోపీటీ  ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే  కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. 

ఐఏఎస్‌ల పిటిషన్‌పై క్యాట్‌ విచారణ చేపట్టింది. వాదనల అనంతరం ..డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్‌ నిరాకరించింది. ప్రతివాదులైన కేంద్రం, డీవోపీటీలకు నోటీసులు ఇచ్చింది. నవంబరు 5లోపు కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. క్యాట్‌ ఆదేశాలతో ఇప్పటికే కేటాయించిన రాష్ట్రాల్లో ఐఏఎస్‌లు రిపోర్ట్‌ చేశారు.

అయితే తమని డొమిసిల్‌,స్వాపింగ్‌ ఆధారంగా కేటాయింపు జరగలేదని, డీవోపీటీ తమ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోలేదని ఏడుగురు ఐఏఎస్‌లు  పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)