Breaking News

ఎమ్మెల్యే మైనంపల్లి నుంచి ప్రాణహాని ఉంది 

Published on Sun, 07/23/2023 - 02:56

పంజగుట్ట: ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఇటీవల అజ్ఞాతంలోకి వెళ్లి వార్తల్లో నిలిచిన రియల్టర్‌ ముక్కెర తిరుపతిరెడ్డి కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం చేయడంలేదన్నారు. అల్వాల్‌ హిల్స్, హైటెన్షన్‌ రోడ్డులో తనపేరుమీద, తన భార్య, భార్య సోదరి పేరుపై మొత్తం 3.31 ఎకరాల భూమి ఉందని, దీని పక్కనే మైనంపల్లికి చెందిన 1.9 ఎకరాల భూమి ఉందని, దీన్ని ఆధారంగా చేసుకుని తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు.

మైనంపల్లి అనుచరులు తనను చంపేందుకు యత్నిస్తున్నారని, అందుకే తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికే పోలీస్‌ కమిషనర్, డీసీపీని కలిసి తనకు ప్రాణాపాయం ఉందని వివరించినట్లు తెలిపారు. సమావేశంలో మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్‌ రెడ్డి, బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్, బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ కన్వినర్‌ ఆర్‌.కె.శ్రీనివాస్, బీజేపీ మౌలాలి కార్పొరేటర్‌ సునీతా యాదవ్, బీజేపీ నాయకులు జి.కె.హనుమంతరావు, మధుసూదన్‌ రెడ్డి పాల్గొన్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)