Breaking News

డిస్కంలను గాడిన పెట్టేందుకే జరిమానాలు

Published on Sun, 10/06/2024 - 04:36

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు సకాలంలో వార్షిక ఆదాయ అవ సరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌), టారిఫ్‌ పిటిషన్లు దాఖలు చేయడం లేదని తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) చైర్మన్‌ టి.శ్రీరంగారావు విమర్శించారు. డిస్కంలను దారిలో పెట్టడానికే జరిమానాల విధానం అమ ల్లోకి తెచ్చామని చెప్పారు. 

శనివారం హైదరా బాద్‌లో జరిగిన ఈఆర్సీ సలహా మండలి సమా వేశంలో ఆయన మాట్లాడుతూ సుస్థిర ఆర్థిక, సామాజికాభివృద్ధికి ఇంధన రంగం పాత్ర కీలకమన్నారు. కేవలం టారిఫ్‌ను నిర్ణయించడమే ఈఆర్సీ బాధ్యత కాదని... వినియోగ దారులందరికీ సరసమైన ధరలో విద్యుత్‌ను అందించడం, నాణ్యమైన విద్యుత్‌ అందేలా చూడటం కూడా తమ బాధ్యతని పేర్కొన్నా రు. 

డిస్కంల పనితీరును మెరుగుపరచడంతో పాటు వాటిలో ఉన్న లోపాలను సరిచేస్తున్నా మన్నారు. విద్యుత్‌ సంస్థలు దాఖలు చేసిన అన్ని పిటిషన్లపై సూచనలు, అభిప్రాయాలు తెలియజేయడానికి ఈనెల 11 దాకా గడువిచ్చా మని, పిటిషన్లపై అధ్యయనం చేసి అభిప్రా యాలు తెలియజేయాలని కోరారు. ఏఆర్‌ఆర్‌ తోపాటు పిటిషన్లపై ఈ నెల 21–25 దాకా బహిరంగ విచారణలు నిర్వహిస్తామన్నారు.

టారిఫ్‌ అమలును వాయిదా వేయాలి: పరిశ్రమల ప్రతినిధులు
డిస్కంలు ఏఆర్‌ఆర్, టారిఫ్‌ ప్రతిపాదనలను ఆలస్యంగా దాఖలు చేసినందున కొత్త టారిఫ్‌ అమలుకు ఐదు నెలలే గడువు ఉందని... వాటిని  విచారణకు స్వీకరించరాదని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ప్రతినిధులు కోరారు. ఏఆర్‌ఆర్‌పై అభ్యంతరాలు తెలపడానికి గడువు పెంచాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. 

ఉద్యోగులపై పనిభారం తగ్గించడానికి తగిన నిర్ణయం తీసుకోవాలని కార్మిక సంఘాల ప్రతినిధులు సూచించగా స్థిర చార్జీలు పెంచాలనే నిర్ణయాన్ని అమలు చేయరాదని పరిశ్రమల ప్రతినిధులు కోరారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)