Breaking News

మళ్లీ కనిపించిన పులి

Published on Fri, 12/20/2024 - 05:00

మంచిర్యాలరూరల్‌ (హాజీపూర్‌): మంచిర్యాల జిల్లా ముల్కల్ల, పాతమంచిర్యాల అటవీ సెక్షన్‌ పరిధిలోని గఢ్‌పూర్‌లో పులులు కెమెరాకు చిక్కాయి. గఢ్‌పూర్‌ సఫారీ మార్గంలోని ఓ చెట్టుకు అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరాకు రెండుసార్లు వేర్వేరు పులులు చిక్కడం గమనార్హం. గత నెల 12న ఇదే కెమెరా మగపులి వెళుతున్న ఫొటోను తీయగా, తాజాగా బుధవారం ఉదయం ఇదే దారి వెంట వెళుతున్న ఆడపులి ఫొటోను తీసింది. అటవీ అధికారులు అడుగులను పరిశీలించి పులిగా నిర్ధారించారు.  

మిరప చేనులో పెద్దపులి 
కౌటాల: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఓ మిరప చేనులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కౌటాల మండలం గుండాయిపేటకు చెందిన జాడే నవీన్‌ మిరప చేనుకు గురువారం ఉదయం నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. చేనులో పడుకుని ఉన్న పులిని చూసి భయపడి గ్రామానికి పరుగులు తీశాడు. 

సమాచారం అందుకున్న కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో వినయ్‌కుమార్‌ సాహూ, అధికారులు పాదముద్రలు పరిశీలించి పెద్దపులి అడుగులుగా నిర్ధారించారు. మహారాష్ట్ర నుంచి వార్దానది దాటి వచ్చినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)