Breaking News

మహదేవపూర్‌ అడవుల్లోకి మళ్లీ పులి!

Published on Sun, 02/16/2025 - 03:46

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ అడవుల్లోకి మళ్లీ పులి వచ్చిందనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ అడవుల్లో తన ఆవాసం ఏ ర్పాటు చేసుకోవడానికి ఆరు రోజులుగా పులి కాటారం, మహదేవపూర్‌ ప్రాంతాల్లో తిరు గుతున్నట్లు తెలియడంతో ఆ రెండు రేంజ్‌ల పరిధిలో ప్రత్యేక బృందాలతో అన్వేషిస్తున్నారు. నస్తూర్‌పల్లి వద్ద పులి అడుగులు కనిపించడంతో అక్కడి నుంచి గూడూరు, వీరాపూర్‌ వరకు పరిశీలిస్తూ వెళ్లగా ఆచూకీ లభించలేదు. అడవి లో అక్కడక్కడా ట్రాకింగ్‌ కెమెరాలు ఏర్పాటు చేసినా.. ఎక్కడా చిక్కలేదు.

అయితే, శనివారం మహదేవపూర్‌ మండలం కుదురుపల్లి సమీపంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద పులి కనిపించినట్లు రోడ్డుమీద వెళ్తున్న వాహనదారులు అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. దట్టమైన అడవి కావడంతో పాటు తాగునీటి వసతి ఉండటంతో పులి ఇక్కడ ఆవాసం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పశువుల కాపరులు ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని, రైతులు వంటచెరుకు కోసం రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహదేవపూర్‌ అడవుల్లో ఎక్కువ సంఖ్యలో ట్రాకింగ్‌ కెమెరాలు అమర్చితే పులి జాడ తెలుస్తుందని భావిస్తున్నారు.

కుదురుపల్లి నుంచి కాటారం, అన్నారం ప్రాంతాల్లో అడవులు దట్టంగా వ్యాపించి ఉన్నాయి. చిన్నచిన్న వాగులతో నీటి వసతి కూడా ఉంది. దీంతో పులి రోజుకు 20–25 కిలోమీటర్ల మేర ప్రయా ణం చేస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయమై అటవీశాఖ రేంజ్‌ అధికారి రవిని సంప్రదించగా కుదురుపల్లి వద్ద పులి కనిపించినట్లు వాహనదారులు తెలిపారని, దీంతో ఆదిలాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక యానిమల్‌ ట్రాకింగ్‌ టీం పగ్‌మార్క్‌లను పరిశోధిస్తోందని వివరించారు. గతంలో ఈ ప్రాంతంలో సంచరించిన కే–8  పులి మళ్లీ వచ్చిందా? లేక మరేదైనా కొత్త పులా అనేది తెలియాల్సి ఉందని అధికారులు చెపుతున్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)