Breaking News

పెద్దపులి ఎక్కడ?

Published on Thu, 12/12/2024 - 04:41

మంగపేట: ములుగు జిల్లా వెంకటాపురం (కె), మంగపేట మండలాల పరిధి చుంచుపల్లి అటవీప్రాంతానికి వచ్చిన పెద్దపులి ఎటువైపు వెళ్లిందోనని అటవీ శాఖ అధికారులు సెర్చింగ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. సుమారు 15 మంది అధికారులు బుధవారం గోదావరి తీర ప్రాంతం వెంట పులి ఆనవాళ్లను పరిశీలించారు. 

నిమ్మగూడెం పంచాయతీ పరిధి తిమ్మాపురం ముసలమ్మవాగు సమీపంలోని చౌడొర్రె ప్రాంతంలోని వరి పొలం వద్దకు వెళ్లిన రామచంద్రునిపేట గ్రామానికి చెందిన పగిళ్ల రంగయ్య, వెంకటేశ్వర్లుకు కొంతదూరంలో పెద్దపులి కనిపించింది.

దీంతో భయపడిన రైతులు విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా, సుమారు 30 మంది కలిసి పులి కనిపించిన ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడినుంచి పెద్దపులి సమీపంలోని ముసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలోని మల్లూరు వాగు మధ్యతరహా ప్రాజెక్టువైపు ఉన్న రాళ్లవాగువైపు వెళ్లినట్లు అడుగులు కనిపించడంతో విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. 

మంగపేట అటవీశాఖ ఇన్‌చార్జ్‌ రేంజ్‌ అధికారి అశోక్‌ మరో 20 మంది సెక్షన్, బీట్‌ ఆఫీసర్లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పులి పాద ముద్రలను గుర్తించిన అధికారులు అక్కడినుంచి సెర్చింగ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. ముసలమ్మగుట్ట, కొప్పుగుట్ట అటవీప్రాంతంనుంచి అవతలి వైపు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కొత్తగూడెం, గోళ్లగూడెం మీదుగా కిన్నెరసాని అభయారణ్యంలోకి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. 

రెండు రోజులుగా జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నా ఎలాంటిì ప్రాణనష్టం జరగకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్లయింది. 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)