Breaking News

పెద్దపులి కనిపిం‘చేను’!

Published on Sun, 12/29/2024 - 04:48

నల్లబెల్లి/మన్ననూర్‌: వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపూర్, మూడుచెక్కలపల్లి, ఒల్లేనర్సయ్యపల్లి, రుద్రగూడెం, కొండాయిల్‌పల్లి గ్రామాల శివారులో పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతాలను వదిలి గ్రామాల సమీపంలోని పంటచేలల్లో పెద్దపులి సంచరించడంతో.. రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. 

కొండాపూర్‌ అటవీ ప్రాంతం నుంచి ఆడపులి, పిల్ల పులి మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలోని కోనాపురం వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. కొండాపూర్‌ అటవీ ప్రాంతం నుంచి మగ పెద్దపులి మూడుచెక్కలపల్లి, ఒల్లేనర్సయ్యపల్లి గ్రామాల మీదుగా రుద్రగూడెం, కొండాయిపల్లి గ్రామాల మధ్యలోని పలుగుఏనె (గుబురు చెట్లతో కూడుకున్న అటవీ ప్రాంతం) వరకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 

కానీ, ఒల్లేనర్సయ్యపల్లి, రుద్రగూడెం గ్రామాల్లో శనివారం తిరుగు ప్రయాణంలో పెద్దపులి సంచరించినట్లు పలువురు చెబుతున్నారు. కాగా పోలీసులు, అటవీ శాఖ, స్ట్రైక్‌ఫోర్స్‌ అధికారులు పంట చేలలో పులి కదలికలను పరిశీలించి పాదముద్రలను సేకరించారు.  మొక్కజొన్న చేనులో సేదదీరిన ప్రాంతాన్ని గుర్తించారు. అవన్నీ పెద్దపులి పాదముద్రలేనని, తిరిగి వెళ్లలేదని నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.   

సఫారీలో పెద్దపులి సందడి 
అమ్రాబాద్‌ పులుల రక్షిత అభయారణ్యం సఫారీ వాహన సందర్శకులకు శనివారం ఉదయం పెద్ద పులి కనిపించింది. ఫర్హాబాద్‌ సఫారీ పాయింట్‌ నుంచి వ్యూ పాయింట్‌కు సందర్శకులు వాహనంలో వెళ్తుండగా.. మార్గమధ్యలో పెద్దపులి అటవీశాఖ ఇంటర్నల్‌ రోడ్డు దాటుతూ కనిపించింది. అకస్మాత్తుగా చెట్ల మధ్యనుంచి వాహనం సమీపంలోకి పెద్దపులి రావడంతో సందర్శకులు కొంత భయపడినా.. దగ్గరి నుంచి చూశామని సంతోషపడ్డారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)