Breaking News

ప్రాణం తీసిన వేగం

Published on Thu, 10/02/2025 - 01:58

పహాడీషరీఫ్‌: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయాలపాలయ్యాడు. రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్‌ పీఎస్‌ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. రాజేంద్రనగర్‌లోని హనుమాన్‌నగర్‌కు చెందిన కొండ రామకృష్ణ కుమారుడు అరుణ్‌ (24) సాయంత్రం 6.30 గంటలకు తన పల్సర్‌ బైక్‌ (టీజీ 08సి 4722)పై పెద్ద గోల్కొండలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. 

ఇదే సమయంలో హర్షగూడకు చెందిన ఇస్లావత్‌ నరేష్‌ కుమారుడు, స్కూల్‌ బస్సు క్లీనర్‌గా పనిచేసే మోహన్‌ (18), రమావత్‌నర్స్‌ కుమారుడు ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సిద్ధూ(17), ఇస్లావత్‌ సేవ్య కుమారుడు సింహాద్రి (17) యూనికార్న్‌ బైక్‌ (టీఎస్‌07జేఏ 9052)పై పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు హర్షగూడ నుంచి తుక్కుగూడకు వస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా వెళ్తున్న వీరి బైక్‌లు.. అవుటర్‌ సర్వీస్‌ రోడ్డులోని పీవీఆర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. 

ప్రమాదంలో అరుణ్‌తో పాటు యూనికార్న్‌ నడిపిన సిద్ధూ, వెనుక కూర్చున్న మోహన్‌లు దూరంగా ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. సింహాద్రికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేందర్‌రెడ్డి, ఎస్‌ఐ దయాకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన సింహాద్రిని వెంటనే ఆస్పత్రికి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మోహన్, సిద్ధూ వరుసకు బావ బావమరుదులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)