Breaking News

‘మహంకాళి’ డీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

Published on Sun, 06/22/2025 - 09:50

రాంగోపాల్‌పేట్‌: వజ్రాల వ్యాపారిని భయపెట్టి రూ.6 లక్షలు వసూళ్లు చేసిన కేసులో మహంకాళి డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇద్దరు క్రైం కానిస్టేబుళ్లను నగర పోలీస్‌ కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. వివరాలలోకి వెళితే...డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ప్రసాద్, క్రైమ్‌ కానిస్టేబుళ్లు శ్యాం, మహేష్‌లు గత నెల 31వ తేదీన కడపకు చెందిన ఓ వజ్రాల వ్యాపారి నుంచి జనరల్‌బజార్‌లో కోటి రూపాయల విలువ చేసే వజ్రాలను స్వా«దీనం చేసుకున్నారు. సదరు వ్యాపారి వజ్రాలను తీసుకుని వచ్చి నగరంలోని వివిధ వ్యాపారులకు విక్రయిస్తుంటాడు.

ఈ మేరకు వజ్రాలకు సంబంధించిన అన్ని బిల్లులు చూపించినప్పటికీ వినకుండా కేసు నమోదు చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. చివరకు ఈ కేసుకు సంబంధించి రూ.6 లక్షలు ఇస్తానని సదరు వ్యాపా రి పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటనే వ్యాపారి అకౌంట్‌ నుంచి డీఐకి  చెందిన స్నేహితుడి ఖాతాకు రూ.6 లక్షలు జమ అయ్యాయి. అయితే పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిన వ్యాపారి వెంటనే తన అకౌంట్‌ నుంచి తన ప్రమే యం లేకుండా రూ.6 లక్షలు డ్రా అయ్యాయని బ్యాంకులో ఫిర్యాదు చేశారు. 

ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులకు దీని గురించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో పూర్తిగా ఆధారాలు సేకరించిన అనంతరం డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ వైకే ప్రసాద్, క్రైం కానిస్టేబుళ్లు శ్యాం, మహే‹Ùలను సస్పెండ్‌ చేస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇదే డీఐ ప్రసాద్‌ తాను పని చేసే చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కొద్ది నెలల క్రితం ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన కేసులో సస్పెండ్‌ అయ్యాడు. ఈ కేసు విచారణ అనంతరం మహంకాళి పోలీస్‌స్టేషన్‌కు ఆయనను అటాచ్‌ చేశారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)