Breaking News

ఒకే గ్రామంలో ముగ్గురి ఆత్మహత్య

Published on Fri, 10/24/2025 - 04:49

హయత్‌నగర్‌: వారంతా ఒకే గ్రామానికి చెందిన వారు. చిన్నప్పుడు ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుకు న్నారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఒకరి తర్వాత ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొహెడ గ్రామంలో జరిగిన ఈ ఘటనలు స్థానికంగా కలకలం సృష్టించాయి. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గ్యార శివరాజు కుమార్తె వైష్ణవి (18) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. 

మంగళవారం కడుపు నొప్పి ఎక్కువ కావడంతో సాయంత్రం డాక్టర్‌ వద్దకు తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. అనంతరం స్నానం చేసి వస్తానంటూ వెళ్లిన వైష్ణవి.. బెడ్రూంలో గడియ పెట్టుకొని చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఎంత సేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు బద్దలుకొట్టి చూడగా వైష్ణవి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

ఈ ఘటన జరిగిన మర్నాడే సతాలి వెంకటేశ్‌ కుమారుడు రాకేశ్‌ (21) బుధవారం రాత్రి తన సోదరుడి దుకాణంలో పడుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లి అర్ధరాత్రి తర్వాత ఫ్యాన్‌కు ఉరేసుకొని తనువు చాలించాడు. గురువారం ఉదయం తల్లి యాదమ్మ షాప్‌ ఊడ్చేందుకు షట్టర్‌ తెరిచి చూసి కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు వచ్చి కిందకు దించి చూడగా అప్పటికే రాకేశ్‌ మృతిచెందాడు. రాకేశ్‌ మరణవార్త తెలుసుకొని అతని మృతదేహాన్ని చూసి ఇంటికొచ్చిన బుద్ద నర్సింహ రెండో కుమార్తె శ్రీజ (18) ఇంట్లోకి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకుంది. 

ఆమె సోదరి గమనించి కజిన్‌కు విషయం చెప్పడంతో అతను వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరిచాడు. అప్పటికే శ్రీజ లుంగీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న 108 అంబులెన్స్‌ వైద్య సిబ్బంది శ్రీజను పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వరుస ఆత్మహత్య ఘటనలపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌