Breaking News

నేను తోపుడు బండిని.. నా ధర రూ.8వేలు..

Published on Thu, 09/04/2025 - 11:35

ములుగు: ‘నేను తోపుడు బండిని.. నా ధర రూ.8వేలు.. మన గ్రామంలో మంచి మనసున్న దాతలు ముందుకు వస్తే మన గ్రామ పంచాయతీకి వెళ్లి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’అనే ఫ్లెక్సీని ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండల పంచాయతీ కార్యదర్శి చందులాల్‌ స్వయంగా ఫ్లెక్సీ కట్టడం జిల్లాలో చర్చనీయాంశమైంది. 

స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క సొంత ఇలాకాలో.. అదీ సొంత శాఖలోనే నిధులు లేవా అన్న చర్చ జరుగుతోంది. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కట్టడమే కాకుండా మండల కేంద్రంలోని పలు కూడళ్లలో సిబ్బందితో ఫ్లెక్సీలను కట్టించి వాట్సాప్‌ గ్రూప్‌లో సైతం ఫొటోలు ఆప్‌లోడ్‌ చేశాడు. దీంతో ప్రతిపక్ష నాయకులతోపాటు గ్రా మస్తులు మేజర్‌ గ్రామపంచాయతీ అయిన వెంకటాపురంలో తోపుడు బండి కోనేందుకు రూ.8వేలు లేవా అంటూ విమర్శిస్తున్నారు. 

ఓ పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిధులు లేవంటూ ఫ్లె క్సీలు కట్టడం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ విషయమై డీపీ ఓ దేవరాజ్‌ను వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శి చందులాల్‌ ఫ్లెక్సీలు కట్టిన విషయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి చందూలాల్‌ను వివరణ కోరగా పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచేందుకు కొత్త తరహాలో ఆలోచించి ఫ్లెక్సీలు కట్టించినట్లు వెల్లడించారు.

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)