Breaking News

ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక

Published on Sun, 07/28/2024 - 08:06

సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం రాత్రి 53.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం చేరుకుంది. దీంతో, అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

కాగా, భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో గోదావరిలో నీటి మట్టం పెరిగింది. దీంతో, రానున్న 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. శనివారం రాత్రి 53.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం అలాగే కొనసాగుతోంది. ఇక, భద్రాచలం వద్ద  ఈరోజు ఉదయం ఆరు గంటలకు గోదావరి వరద 53.7 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులకు నేడు సెలవును రద్దు చేశారు. అధికారులందరూ నేడు విధుల్లోనే ఉండనున్నారు.

మరోవైపు.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీరు భారీగా పెరిగింది. గోదావరి నీటి మట్టం 15 అడుగులు నమోదైంది.  దీంతో, 14 లక్షల 83 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో వెళ్తోంది. ఇక, అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా, గోదావరి వరద రోజుల తరబడి ప్రవహిస్తుండటంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోనసీమలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అప్పన రాముని లంక, గంటి పెదపూడి లంకల వద్ద అధికారులు బోట్లు ఏర్పాటు చేశారు. మిగిలిన లంక ప్రాంతాల్లో ట్రాక్టర్లు, కాలినడకన లంకవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)