Breaking News

అయ్యో.. అమ్మాయి!

Published on Sun, 06/08/2025 - 06:08

సాక్షి, హైదరాబాద్‌: విద్య మనిషిలో వివేకాన్ని, చైతన్యాన్ని పెంచుతుందంటారు. కానీ, మనదేశంలో చదువుకున్నవాళ్లు అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యతతోపాటు మూఢత్వం కూడా పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లోని జనాభాలో బాలురతో పోల్చితే బాలికల శాతం వేగంగా పడిపోవటమే అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌)–2021 గణాంకాలు దేశంతోపాటు తెలంగాణలో బాలికల జనాభా, మొత్తం జననాల రేటు ప్రమాదకరంగా పడిపోతున్న వైనాన్ని బయటపెట్టాయి.

జననాల రేటులోనూ అథమమే.. 
జననాల రేటు కూడా తెలంగాణలో గణనీయంగా తగ్గిపోయింది. ఒక మహిళ తన గర్భస్థ సామర్థ్య కాలపు సాధారణ ఫర్టిలిటీ రేటు (టీఎఫ్‌ఆర్‌) తెలంగాణలో 1.5కి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మరింత తక్కువగా 1.4కి పడిపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఇది జనాభా స్థిరీకరణకు కావాల్సిన కనీస స్థాయి (2.1) కంటే చాలా తక్కువ. దేశవ్యాప్తంగా 1986లో ఎఫ్‌టీఆర్‌ 4.2గా ఉండగా, 2021 నాటికి 2.0కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో 4.5 నుంచి 2.2కి తగ్గింది.

పట్టణాల్లో తగ్గిన బాలికా జననాలు
దక్షిణ భారతదేశంలో 100 శాతం అక్షరాస్యత ఉన్న కేరళలో మినహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో లింగ నిష్పత్తిలో తేడా గణనీయంగా పెరిగిందని ఎస్‌ఆర్‌ఎస్‌ సర్వేలో తేలింది. తెలంగాణలో జననాల రేటు ప్రమాదకరంగా 1.5 శాతానికి పడిపోయింది. అందులో బాలికల జననాలు మరింత తక్కువగా ఉన్నాయి. దేశంలో లింగనిష్పత్తి 913 (1,000 మంది పురుషులకు 913 మంది స్త్రీలు) ఉండగా, తెలంగాణలో అది 902కే పరిమితమైంది.

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరాల్లో లింగనిష్పత్తి మరింత తగ్గింది. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌ వంటి నగరాల్లో లింగ నిష్పత్తి 1,000కి 896 మాత్రమే ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యల్పం. ఈ గణాంకాలు రాష్ట్రంలో బాలికల పట్ల వివక్షకు నిదర్శనంగా నిలుస్తున్నాయని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే శ్రామిక సామర్థ్యం, లింగ సమతుల్యతపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

త్వరలో వృద్ధ భారతం
ఈ గణాంకాల ప్రకారం చూస్తే త్వరలోనే తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధుల జనాభా శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల శ్రామిక శక్తి తగ్గిపోతుంది. ఉత్పాదకత తగ్గి ఆరోగ్య సంరక్షణ ఖర్చులు అధికం అవుతాయి. లింగ వివక్షతో పాటు తక్కువ ఫర్టిలిటీ రేటు ఉన్న రాష్ట్రాలు భవిష్యత్తులో పెళ్లిళ్లు ఆలస్యమవడం, ఉద్యోగ విభాగాల్లో యువ శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

#

Tags : 1

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య