Breaking News

మనుషులకంటే ఫోన్‌ కనెక్షన్‌లే ఎక్కువ

Published on Fri, 03/21/2025 - 04:23

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జానాభా కంటే ఫోన్‌ కనెక్షన్లే అధికంగా ఉన్నాయి. మొబైల్‌ కనెక్షన్ల డెన్సిటీ (సాంద్రత)లో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక ముఖచిత్రం (సోషియో ఎకనామిక్‌ ఔట్‌లుక్‌)లో 2024 సెప్టెంబర్  వరకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ప్రకటించిన డేటాను పొందుపరిచింది. దేశంలో వైర్‌లెస్‌ ఫోన్ల డెన్సిటీలో గోవా (152.64 శాతం) మొదటి స్థానంలో ఉంది. కేరళ (115.05 శాతం), హర్యానా (114.08 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. తెలంగాణ (105.82 శాతం) నాలుగో స్థానంలో నిలిచింది.  

బలమైన సమాచార వ్యవస్థ 
రాష్ట్రంలో మొత్తం ఫోన్‌ కనెక్షన్లు 41.94 మిలియన్లు (దాదాపు 4 కోట్ల 19 లక్షల 40 వేలు) ఉన్నాయని ఆర్థిక సర్వేలో తెలిపారు. అందులో వైర్‌లెస్‌ కనెక్షన్లు 40.42 మిలియన్లు (4 కోట్ల 42 వేలు) ఉన్నట్లు తేల్చారు. ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ కనెక్షన్లు రాష్ట్రంలో 1.52 మిలియన్లు ఉన్నట్లు వెల్లడించారు. సమాచార వ్యవస్థ తెలంగాణలో బలోపేతంగా ఉన్నట్లు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని సర్వే నివేదికలో ప్రభుత్వం తెలిపింది. 

పట్టణాలు, నగరాల్లో వైర్‌లెస్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌ బలంగా ఉంది. మొత్తం వైర్‌లెస్‌ కనెక్షన్లలో పట్టణాల్లో 23.87 మిలియన్లు (59.05 శాతం) ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 16.55 మిలియన్లు (40.95 శాతం) ఉన్నాయి. ల్యాండ్‌లైన్‌ ఫోన్లలో పట్టణా ల్లో 1.46 మిలియన్‌ కనెక్షన్లు ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో 0.06 మిలియన్లు ఉన్నాయి. 

బ్రాడ్‌బ్యాండ్‌ జోరు 
రాష్ట్రంలో డిజిటల్‌ ఇన్ఫర్మేషన్‌ మౌలిక సదుపాయాలు భారీగా విస్తరిస్తున్నాయి. తెలంగాణలో 36.43 మిలియన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్నట్లు ట్రాయ్‌ లెక్కలు తేల్చాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ఈ– పరిపాలన, విద్య, ఆరోగ్యం, ఐటీ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో బ్రాండ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్లు అధికంగా ఉన్నాయి. బ్రాండ్‌బ్యాండ్, న్యారోబ్రాండ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్లలో బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ 98% ఉన్నాయి. మొత్తం 36.43 ఇంటర్నెట్‌ కనెక్షన్లలో బ్రాండ్‌బ్యాండ్‌ కనెక్షన్లు 35.68 మిలియన్లు, న్యారోబ్రాండ్‌ కనెక్షన్లు 0.75 లక్షలు ఉన్నట్లు వివరించింది. 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)