Breaking News

దరఖాస్తు గడువు నేడు.. కాంట్రాక్టు ముగిసేది ఎల్లుండి!

Published on Wed, 03/29/2023 - 04:03

సాక్షి, హైదరాబాద్‌: ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్విసెస్‌ (ఐఎంఎస్‌) డైరెక్టరేట్‌ పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అభ్య­ర్థుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఉద్యోగ ప్రకట­ననుంచి దరఖాస్తు ప్రక్రియ వరకు అపోహలు తలెత్తుతుండటం..దీనిపై అధికా­­రుల నుంచి స్పష్టత లేకపోవడంతో అభ్యర్థు­లు ఆందోళన చెందుతున్నారు. ఐఎంఎస్‌ ఆ«­ద్వర్యంలో నిర్వహిస్తున్న ఈఎస్‌ఐ ఆస్ప­త్రు­ల్లో 231 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

అత్యవసర కేటగిరీకి చెం­దిన ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలంటూ కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిని ఉత్తర్వు­లు జారీ­చే­శారు. దీని ప్ర­కా­రం ఐఎంఎస్‌.. జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిని జిల్లా స్థా­యి కమిటీల ద్వారా భర్తీ చేస్తారు. కమిటీకి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, ఐఎంఎస్‌ ప్రాంతీయ సంయుక్త సం­చా­లకుడుకన్వీనర్‌గా, డీఎంహెచ్‌ఓ, డీసీ­హెచ్‌ఎస్, ఈఎస్‌ఐ ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌లు సభ్యులుగా ఉంటారు. 

దరఖాస్తు ప్రక్రియలో లోపాలు 
దరఖాస్తులను మాన్యువల్‌ పద్ధతిలోనే స్వీకరించనున్నట్లు ఐఎంఎస్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు ఐఎంఎస్‌ రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాధారణంగా మా­న్యు­వ­ల్‌ పద్ధతిలో దరఖాస్తు తీసుకున్నాక.. దరఖాస్తుకు జతచేసిన పత్రాలకు సంబంధించిన చెక్‌లిస్ట్‌ను అభ్యర్థికి రసీదు రూపంలో ఇవ్వాలి.

అయితే, ఇక్కడ అలాంటిదేమీ జరగట్లే­దు. దీంతో పోస్టుల భర్తీలో అవకతవకలకు ఆస్కారం ఉందంటూ అభ్యర్థులు ఆరోపిస్తు­న్నా­రు. మరోవైపు జిల్లాల వారీగా ఉద్యోగ ప్ర­కటనలో రోస్టర్, రిజర్వేషన్‌ అంశాలను ప్రస్తావించకపోవడాన్నీ తప్పుబడుతున్నారు. 

కాంట్రాక్టు ఎప్పటివరకు? 
కారి్మకశాఖ జారీచేసిన జీఓ 25 ప్రకారం ఐఎం­ఎస్‌లో 231 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించినఏడాది కాంట్రాక్టు గడు­వు ఈనెల 31తో ముగియనుంది. ఒకవైపు 31వ తేదీతో కాంట్రాక్టు గడువు ముగియనుండగా.. 29 వరకు దరఖాస్తులను స్వీకరిస్తుండటం గమనార్హం.

ఈనెల 30కల్లా ఇంట­ర్వ్యూలు నిర్వహించి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు వెనువెంటనే జారీచేసినా అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరే నాటికే కాంట్రాక్టు గడువు ముగుస్తుందని ఐఎంఎస్‌ అధికారులే చెబుతున్నారు. ఈ నిబంధన కూడా ఉద్యోగార్థుల్లో గందరగోళం రేకెత్తిస్తోంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)