Breaking News

బాలింతకు నరకయాతన..

Published on Mon, 11/04/2024 - 04:19

అనంతగిరి (అరకులోయ రూరల్‌): పచ్చి బాలింతరాలు.. పైగా, సిజేరియన్‌ ద్వారా ప్రసవం జరిగి వారం రోజులే అయింది.. క్షేమంగా ఆమెను ఇంటి వద్దకు చేర్చాల్సిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది ఆమెను నిర్లక్ష్యంగా, నిర్దయగా గ్రామానికి 3 కి.మీ. దూరంలో వదిలేసి వెళ్లిపోయారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి.. మండలంలోని పినకోట పంచాయతీ వాజంగి గ్రామానికి చెందిన గిరిజన మహిళ తామర్ల జ్యోతి(32)ని ప్రసవం కోసం విశాఖలోని కేజీహెచ్‌లో వారం కిందట చేర్చారు. 

కాన్పు ఇబ్బంది కావడంతో శస్త్రచికిత్స చేశారు. పండంటి ఆడ శిశువు పుట్టింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగానే ఉండటంతో వైద్యుల సలహా మేరకు ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. వాజంగిలోని బాలింత ఇంటి వరకు రావాల్సిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ గ్రామానికి 3 కి.మీ. దూరంలోనే వారిని దింపేసి సిబ్బంది వెళ్లిపోయారు. 

దీంతో శస్త్రచికిత్స చేయించుకున్న తాను మరో దారిలేక కష్టంగా కాలినడకన ఇంటికి చేరాల్సి వచ్చిందని బాలింత జ్యోతి, ఆమె బంధువు రవికుమార్‌ ఆవేదన వ్యక్తంచేశారు. శస్త్ర చికిత్స కుట్లు ఇంకా పచ్చిగానే ఉండటంతో గ్రామానికి చేరేందుకు నరకయాతన చూడాల్సి వచ్చిందని బాధితు రాలు వాపోయింది. వాహన సిబ్బంది కనీస మానవత్వం చూపలేదని, తామింక రాలేమని వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆమె ఆరోపించింది. 

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)