Breaking News

ప్రయాణికులకు అలర్ట్‌.. MGBS నుండి బస్సు సర్వీసులు ప్రారంభం

Published on Sun, 09/28/2025 - 12:55

సాక్షి, హైదరాబాద్‌: ఎంజీబీఎస్‌ నుంచి తిరిగి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. యథావిధిగా ప్రతీరోజు నడిచే బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు ఆదివారం మధ్యాహ్నం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకకు బస్సు సర్వీసులు నడుస్తాయని స్పష్టం చేశారు. సూపర్ లగ్జరీ, డీలక్స్, స్పెషల్ బస్సులతో సహా సుమారు 2500 సర్వీసులు తిరిగి రాకపోకలు కొనసాగించనున్నాయి. 

ఇక, మూసీ నదికి వరద ఉద్ధృతి తగ్గింది. దీంతో బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. శనివారం కురిసిన వర్షానికి ఎంజీబీఎస్‌​లో పేరుకుపోయిన బురదను ఈ ఉదయం నుంచి సిబ్బంది తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. వరద కారణంగా శనివారం ఊర్లకు వెళ్లాలి అనుకున్న ప్రయాణికులు ఇప్పుడు బయలు దేరుతున్నారు. ప్రస్తుతం బస్టాండ్​ ప్రయాణికులతో కళకళలాడుతుంది.

పలు ప్రాంతాల నుంచి జిల్లాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. ప్రయాణికులు పికప్‌ పాయింట్ల వద్దకు వెళ్లాలని ఆర్టీసీ సిబ్బంది సూచిస్తున్నారు. ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, జేబీఎస్‌ నుంచి జిల్లాలకు బస్సులు నడుస్తున్నాయి. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు పికప్‌ పాయింట్ల వద్దకు వెళ్లాలని అధికారులు చెబుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)