Breaking News

మార్చి ఆఖరులోగా ‘గ్రూప్స్‌’ తుది ఫలితాలు

Published on Sun, 12/15/2024 - 04:59

సాక్షి, హైదరాబాద్‌: ‘గ్రూప్స్‌’ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా పూర్తవుతుందని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చైర్మన్‌ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఇప్పటికే గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీ పూర్తయిందని.. వచ్చే ఏడాది జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరిలో గ్రూప్‌–1 పరీక్షల తుది ఫలితాలు ఇస్తామని తెలిపారు. తర్వాత గ్రూప్‌–2 ఫలితాలు, వెనువెంటనే గ్రూప్‌–3 ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆదివారం నుంచి గ్రూప్‌–2 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం టీజీపీఎస్సీ కార్యాలయంలో బుర్రా వెంకటేశం మీడియాతో మాట్లాడారు.

పకడ్బందీగా ఏర్పాట్లు
ఈ నెల 15వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్‌–1, అదేరోజు మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్‌–2, 16వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్‌–3, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్‌–4 పరీక్ష జరుగుతాయని బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ మేరకు పకడ్బందీగా ఏర్పాటు చేశామని చెప్పారు. 783 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఒక్కో పోస్టుకు సగటున 70 మంది పోటీ పడుతున్నారని వెల్లడించారు.

గ్రూప్‌–2 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేశామని.. ప్రత్యక్షంగా 49,848 మంది, పరోక్షంగా మరో 25 వేల మంది సిబ్బంది పరీక్షల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం నాటికి 75 శాతం మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెప్పారు. అభ్యర్థులకు బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలతో పరీక్ష తీరును పర్యవేక్షిస్తామని తెలిపారు.

ఈ నెల 18 నుంచి ఢిల్లీ పర్యటన..
టీజీపీఎస్సీని మరింత పటిష్టం చేసే క్రమంలో.. ఈ నెల 18, 19 తేదీల్లో టీజీపీఎస్సీ బృందంతో కలిసి ఢిల్లీలో పర్యటించనున్నట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 18న యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)ను, మరుసటి రోజు స్టాఫ్‌ సెలెక్షన్‌కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ), తర్వాత నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ని సందర్శిస్తామని చెప్పారు. పరీ క్షలను పారదర్శకంగా నిర్వహించే విధానాలపై అధ్యయ నం చేస్తామని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమ ర్పిస్తామని తెలిపారు.

వచ్చే నెలలో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లు టీజీపీఎస్సీకి వచ్చే అవకాశం ఉందనితెలిపారు. కొత్త నోటిఫికేషన్లను జాబ్‌ క్యాలెండర్‌ ఆధారంగా ప్రకటిస్తామన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించినది టీజీపీఎస్సీయేనని చెప్పారు. టీజీపీఎస్సీలో కొత్తగా 80మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పై తీసుకుంటున్నట్లు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)