Breaking News

ఆన్‌లైన్‌ బుకింగ్‌పై అప్రమత్తంగా ఉండండి

Published on Sun, 01/12/2025 - 06:07

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగ నున్న మహాకుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులందరూ ఆన్‌ లెన్‌ బుకింగ్‌లపై జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) సూచించింది. ఆన్‌ లైన్‌లో హోటల్, ధర్మశాల, గెస్ట్‌హౌస్‌ బుకింగ్‌ల సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 45 రోజులపాటు జరిగే ఈ కుంభమేళాకు లక్షలాది మంది సందర్శకులు రాను న్నందున యాత్రికులను మోసం చేయడానికి సైబర్‌ నేరస్తులు నకిలీ వెబ్‌సైట్లు, లింక్‌లను సృష్టించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఎలాంటి రిజర్వేషన్‌ లేకుండానే తగ్గింపు ధరలకే వసతిని అందిస్తామంటూ మోసగాళ్లు భక్తులను ఆకర్షిస్తారని.. హోటళ్లు, ధర్మశాల, టెంట్‌ సిటీలకు ముందస్తు చెల్లింపులను వసూలు చేయడానికి మోసపూరిత వెబ్‌సైట్‌లు, నకిలీ బుకింగ్‌ లింక్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొంది.

టీజీసీఎస్‌బీ సూచనలు..
⇒ అధికారిక మార్గాల్లోనే వసతిని బుక్‌ చేసుకోండి. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ద్వారా ధ్రువీకరించబడిన సంప్రదింపు నంబర్లు, వెబ్‌సైట్‌లను ఉపయోగించండి. ఈ అధికారిక వెబ్‌సైట్‌  https://kumbh.gov.in/en/ Wheretostaylist  అందుబాటులో ఉంది.
⇒  అసాధారణంగా తక్కువ ధరలకు వసతిని అందించే తెలియని లింక్‌లు లేదా ప్రకటనలపై క్లిక్‌ చేయవద్దు.
⇒  తెలియని ఖాతాలకు లేదా అనధికారిక బుకింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ముందస్తు చెల్లింపులు చేయవద్దు.

⇒  అధికారికంగా క్రాస్‌–చెక్‌ చేయడం లేదా రాష్ట్ర అధికారు లను నేరుగా సంప్రదించడం ద్వారా ఏదైనా వసతి లేదా సర్వీస్‌ ప్రొవైడర్‌ ప్రామాణికతను ధ్రువీకరించుకోండి.
⇒  వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
⇒   ఒకవేళ మోసానికి గురైనట్లయితే వెంటనే జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కు కాల్‌ చేయడం ద్వారా లేదా www. cybercrime. gov. in లో అధికారిక సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ను సందర్శించి ఫిర్యాదు చేయండి.
⇒   సైబర్‌ భద్రతపై మరింత సమాచారం కోసం.. tgcsb.tspolice.gov.in ని సందర్శించండి. 
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)