Breaking News

ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేలా!

Published on Wed, 06/11/2025 - 01:47

సాక్షి, హైదరాబాద్‌: నైజీరియన్‌ డ్రగ్స్‌ ముఠా లను మూలాల నుంచి దెబ్బకొట్టేందుకు ప్రత్యే క వ్యూహాలతో తెలంగాణ యాంటీ నార్కో టిక్స్‌ బ్యూరో (టీజీఏఎన్‌బీ) ముందుకు వెళ్తోంది. ఇక్కడ సంపాదించిన సొమ్ము ను హవాలా మార్గాల్లో విదేశాలకు చేరవేస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడుతున్న ఈ ముఠాల ఆర్థిక లావాదేవీలను కట్టడి చేసేదిశగా టీజీఏఎన్‌బీ అధికారులు కొంత పురోగతి సాధించారు. ఇ

టీవల గోవాలో నిర్వహించిన ఆపరేషన్‌లో పట్టు బడిన నైజీరియన్‌ డ్రగ్స్‌ ముఠాకు చెందిన మ్యాక్స్‌వెల్‌ 150కి పైగా బ్యాంకు ఖాతాలను వాడి డబ్బును నైజీరియాకు చేరవేస్తున్నట్టు గుర్తించారు. మనీలాండరింగ్‌ ఆధారాలున్నందున రెడ్‌కార్నర్‌ నోటీ సుల జారీకి సన్నద్ధమయ్యారు. ఈ అంశంపై ఈడీ అధికారులకు కూడా సమాచారం చేరవేసినట్టు తెలిసింది. 

డ్రగ్స్‌ దందాలో సంపాదించిన సొమ్మును దేశం దాటించే మార్గాలను మూసివేస్తే.. నైజీరి యన్లు మనదేశం వైపు రాకుండా కట్టడి చేయవచ్చన్నది ఈ వ్యూహంలో ముఖ్య అంశం. వారికి స్థానికంగా ఇల్లు, విల్లాలు అద్దెకు ఇవ్వకుండా కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. విదేశీయు లకు ఇళ్లు అద్దెకు ఇవ్వాలంటే స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడం తప్పనిసరి అని టీజీఏఎన్‌బీ అధికా రులు తెలిపారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

హవాలా మార్గాల మూసివేతపై ఫోకస్‌ 
గోవా పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తూ హైదరాబాద్‌కు కొకైన్‌ సరఫరా చేస్తున్న డీజే వనీష్‌ ఠాకూర్, సప్లయర్‌ బాలకృష్ణ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్, గోవాలోని పర్రా ఏరియా సహా పలు కీలక ప్రాంతాల్లో నెల రోజులపాటు ఏఎన్‌బీ అధికారులు ఇటీవల సీక్రెట్‌ ఆపరేషన్లు నిర్వహించారు. మెడికల్‌ వీసాలపై భారత్‌కు వచ్చి గోవా కేంద్రంగా డ్రగ్స్‌ దందా చేస్తున్న ఎమ్యానుల్‌ బెడియాకో అలియాస్‌ మ్యాక్స్‌వెల్‌ అలియాస్‌ మ్యాక్స్‌ కదలికలపై నిఘా పెట్టారు. 

మ్యాక్స్‌వెల్‌ తన దందాను హైదరాబాద్‌కు విస్తరించేందుకు ప్రయత్నించగా సైనిక్‌పురి ప్రాంతంలో ఇటీవలే అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతో గోవాలో దాదాపు 50 మంది నైజీరియన్లు ఈ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్‌ సొమ్మును దేశం దాటిస్తున్న హవాలా వ్యాపారులు ఉత్తమ్‌సింగ్, రాజుసింగ్, మహేందర్‌ ప్రజాపతిని అరెస్టు చేసి రూ.49.65 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మ్యాక్స్‌వెల్‌ 150 బ్యాంకు ఖాతాల ద్వారా నైజీరియాలోని తన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు డబ్బు పంపినట్లు ఆధారాలు సేకరించారు. ఆ మార్గాలను మూసివేశారు. 

నిబంధనలు అతిక్రమిస్తే చిక్కులు తప్పవు 
విదేశీయులు ఎవరైనా తమ హోటళ్లు, ఇళ్లు, అతిథి గృహా లు లేదా ఫ్లాట్లలో బస చేసినప్పుడు.. వాటి యజమాను లు తప్పక పోలీసులకు సమాచారం ఇవ్వాలని టీజీఏ ఎన్‌బీ అధికారులు తెలిపారు విదేశీయుల చట్టంలోని సెక్షన్‌–7 ప్రకారం సి–ఫారమ్‌ను 24 గంటల్లో తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టంచేశారు. సమాచారం ఇవ్వని పక్షంలో ఆ ఇళ్లలో విదేశీయులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, అందుకు యజమానులు సైతం బాధ్యత వహి ంచాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

ప్రధానంగా హైద రాబాద్‌లో విదేశీయులు ఎక్కువగా నివాసం ఉంటున్న పారామౌంట్‌ కాలనీ, బృందావన్‌ కాలనీ, సైనిక్‌పురి, సన్‌సిటీ, టోలీచౌకి, జూబ్లీహిల్స్, లంగర్‌ హౌస్, బంజారా హిల్స్‌ ప్రాంతాల ఇళ్ల యజమానులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా.. 1908 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

#

Tags : 1

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)