Breaking News

TG: గ్రూప్ -1 నియామకాలకు హైకోర్టు బ్రేక్‌!

Published on Thu, 04/17/2025 - 18:31

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి తాత్కాలిక బ్రేక్ పడింది. గ్రూప్ 1 పరీక్షల్లో అనేక అవతవకలు జరిగాయని హైకోర్టులో 20 పిటిషన్ల వరకూ దాఖలు కావడంతో వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నియామకాలకు తాత్కాలిక బ్రేక్ వేసింది.  ఈ మేరకు గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని స్సష్టం చేసింది. విచారణ పూర్తయ్యే వరకూ నియామక పత్రాలు ఇవ్వొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది.  పోస్టింగ్ లు మాత్రం తుది తీర్పు వెలువడే వరకూ ఇవ్వొద్దని క్లియర్ గా స్పష్టం చేసింది. 

కాగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రూప్‌ 1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకవడంతో రద్దయింది. తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్‌-1 పరీక్షను మళ్లీ నిర్వహించింది. అయితే పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్‌ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది. దీనిపై సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఫలితాలు విడుదల చేయడానికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. 

అయితే గ్రూప్‌-1 సరీక్షల్లో అవతవకలు జరిగాయని పలు పిటిషన్లు దాఖలు కావడంతో నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.  యథావిధిగా సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ చేసుకోవచ్చని, కాకపోతే తుది తీర్పు ఇచ్చే వరకూ పోస్టింగ్‌లు ఇవ్వొద్దని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొదది. దాంతో తమ నియామకాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో నిరాశ అలముకుంది. మళ్లీ గ్రూప్‌-1 పరిస్థితి ఇలా టర్న్‌ తీసుకుందేమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)