Breaking News

ఆర్‌టీఐ చట్టం ప్రజాస్వామ్యానికి బలమైన ఆధారం

Published on Fri, 10/10/2025 - 06:02

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం ప్రజాస్వా మ్యానికి బలమైన ఆధారమని, ప్రజలకు పాలనలో భాగస్వామ్యం అయ్యే శక్తిని ఇస్తుందని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్‌ ఆధ్వర్యంలో సమాచార హక్కుచట్టం వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం తీసుకువస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం కొద్దిమంది చేతుల్లో కాకుండా ప్రజల చేతుల్లోనే ఉండాలని పేర్కొన్నారు.

సరైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉందని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శామ్‌కోషి మాట్లాడుతూ.. ఆర్‌టీఐ చట్టం పౌరులను శక్తివంతం చేస్తుందన్నారు. అయితే కొందరు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, ఈ పద్ధతి సరికాదని సూచించారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం ముఖ్య కమిషనర్‌ జి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్‌టీఐ పనితీరు పురస్కారాలను మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సీవీ ఆనంద్, సాధారణ పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి మహేశ్‌దత్తు, సమాచార హక్కుచట్టం కమిషనర్‌లు పాల్గొన్నారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు