Breaking News

ఇక పురపాలికల్లో ‘ప్రత్యేక’ పాలన

Published on Sun, 01/26/2025 - 04:12

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పాలకమండళ్ల పదవీ కా­లం ఆదివారంతో ముగుస్తోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల పదవీ కాలం పూర్తయి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండగా, సోమవారం నుంచి పట్టణా­లు, నగరాల్లోనూ అధికారుల పాలనే సాగనుంది. రెండు రోజులు ఆలస్యంగా ఎన్నిక జరిగిన కరీంనగర్‌ నగరపాలక సంస్థ పాలక మండలి పదవీ కా­లం మాత్రం ఈనెల 28తో ముగియనుంది. 

కాగా, పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో అనేక ము­నిసిపాలిటీలు, కార్పొరేషన్లలో శనివారమే పాలక­మండళ్ల సభ్యులు సంబరాలు జరుపుకొన్నారు. కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులుగా జిల్లా కలెక్టర్లు, మునిసిపాలిటీలకు ఆర్డీఓ స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు.   

అవినీతి ఆరోపణలు 
2020 జనవరి 22న రాష్ట్రంలోని 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. 24న కరీంనగర్‌ ఎన్నిక జరిగింది. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) మెజారిటీ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకుంది. ఏకంగా 77 మునిసిపాలిటీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకొని తన ఆధిపత్యాన్ని చాటింది. 

2023 డిసెంబర్‌లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారాన్ని కోల్పోవడంతో చాలా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ‘అవిశ్వాస’తీర్మానాల ద్వారా అధికార కాంగ్రెస్‌ పార్టీ పరమయ్యాయి. జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి సహా పలువురు మేయర్లు, మునిసిపల్‌ చైర్మన్లు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

మరో నాలుగురోజుల్లో పదవీ కాలం ముగుస్తుండగా కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌ రావు శనివారం బీజేపీలో చేరారు. కాగా, చాలాచోట్ల పాలక మండళ్లు డబ్బుల సంపాదనే ధ్యేయంగా ఐదేళ్ల పాలన సాగిందన్న ఆరోపణలు వచ్చాయి. 
  
అక్కడ ఇంకా ఏడాదిన్నర.. 
రాష్ట్రంలోని హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) కార్పొరేషన్‌ పదవీ కాలం మరో ఏడాది మిగిలి ఉండగా, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు కొత్తగా ఏ­ర్పా­టైన మరో ఐదు మునిసిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం మరో ఏడాదిన్నర ఉంది. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 2020 డిసెంబర్‌ 1న జరగగా, వరంగ­ల్, ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్లతోపాటు జడ్చ­ర్ల, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట మునిసిపాలిటీల ఎన్నికలు 2021 ఏప్రిల్‌ 30న జరిగాయి. ఈ 8 పురపాలికల పాలక మండళ్ల పదవీ కాలం ఇంకా ఏడాదిన్నర వరకు మిగిలి ఉంది.

ఎన్నికల నాటికి ఇంకా మార్పులు 
కొత్త మునిసిపల్‌ చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే, పదవీ కాలం మిగిలి ఉన్న పాలక మండళ్లను కూడా రద్దు చేసి ఎన్నికలు జరిపించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా మహబూబ్‌నగర్, మంచిర్యాల మునిసిపాలిటీలను కార్పొరేషన్‌లుగా అప్‌గ్రేడ్‌ చేయడంతోపాటు కొత్తగా 12 మునిసిపాలిటీలను ఏర్పాటు చేస్తూ ఇటీవలే ప్రభుత్వం చట్టం చేసింది.

ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి వైపు ఉన్న 50కి పైగా గ్రామాలను పక్కనున్న మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపింది. కాగా మునిసిపల్‌ ఎన్నికల నాటికి ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేసి, మూడు లేదా నాలుగు కార్పొరేషన్లుగా మార్చే యోచనతో ఉంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)