Breaking News

‘పది’కి పకడ్బందీ ఏర్పాట్లు

Published on Wed, 03/11/2026 - 00:49

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 14 నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలవుతాయి. ఏప్రిల్‌ 16తో ఈ పరీక్షలు ముగుస్తాయి మొత్తంగా 5,28,239 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 5,17,727 మంది. 5,329 ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది, 1,057 గురుకులాల నుంచి 60,139 మంది, 5,288 ప్రైవేట్, ఎయిడెడ్‌ స్కూల్స్‌ నుంచి 2,50,015 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. 

ఉదయం 9.30 నుంచి మొదలయ్యే పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను తేలికగా తెలుసుకునేందుకు హాల్‌టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు పంపినట్టు అధికారులు తెలిపారు. మీ సేవ కేంద్రాల ద్వారా కూడా డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 8096958096 వాట్సాప్‌ నంబరు ద్వారా కూడా హాల్‌టికెట్లు పొందొచ్చు. 

కంగారు పెట్టకుండా నిఘా 
పరీక్షలు సజావుగా నిర్వహించాలని జిల్లా అధికారులను పాఠశాల విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఆదేశించారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతీ కేంద్రానికి సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ నిఘా సిబ్బంది, పరీక్షల సిబ్బంది విద్యార్థులను ఆందోళనకు గురిచేసేలా వ్యవహరించొద్దని ఆదేశించారు. 

ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరగాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందే భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు విభాగాన్ని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను నికోలస్‌ ఆదేశించారు. సీసీ కెమెరాల ముందే పరీక్ష పేపర్‌ ఓపెన్‌ చేసేలా ఏర్పాట్లు చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)