Breaking News

అయోమయం... గందరగోళం

Published on Thu, 05/22/2025 - 03:58

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో ఆర్వో (రివర్స్‌ ఆస్మోసిస్‌) వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటు టెండరు ప్రక్రియపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండరు నిబంధనల రూపకల్పన, దరఖాస్తుదారుల ఆర్థిక అంశాల ఎంపిక తికమకగా ఉన్నాయి. టెండర్‌లో పాల్గొనే వారు తయారీదారులై ఉండాలా? లేక పంపిణీ దారుడైతే సరిపోతుందా? అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 398 ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ఈనెల 7న గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ విభాగం టెండర్లు పిలిచింది. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికల్లా కాంట్రాక్టర్లను ఖరారు చేసి ఆర్వో ప్లాంట్లను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. టెండరు ప్రక్రియలో లోపాలున్నాయని, ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. 

టెండరు ప్రక్రియ ఇలా... 
రాష్ట్రంలో మూడు ఏజెన్సీ ప్రాంతాలున్నాయి. ఉట్నూరు, ఏటూరు నాగరం, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు మూడు టెండర్లు పిలిచారు. అదేవిధంగా మన్ననూరు ప్రాజెక్టుకుతోపాటు హైదరాబాద్‌ కేంద్రంగా నిర్దేశించిన విద్యాసంస్థల కోసం మరో టెండరు పిలిచారు. మొత్తం నాలుగు టెండర్ల ద్వారా 398 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. 

ఇందులో 244 ప్లాంట్లు 500 లీటర్‌/అవర్, మిగతా 154 ప్లాంట్లు వెయ్యి లీటర్‌/అవర్‌ సామర్థ్యం గలవి. వీటికి రూ.25 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈనెల 7 నుంచి 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లకు గడువు విధించారు. ఈనెల 16న సాయంత్రం 5 గంటలకు బిడ్లు తెరిచి కాంట్రాక్టరును ఖరారు చేసేలా షెడ్యూల్‌లో ప్రకటించారు. అయితే బిడ్‌ తెరవాల్సిన తేదీ ముగిసి వారమైనా కాంట్రాక్టరును ఖరారు చేయకపోవడం గమనార్హం. 

నిబంధనలపై అభ్యంతరాలివీ.. 
» టెండరు ప్రక్రియలో దరఖాస్తు గడువు కీలకం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం టెండరు ప్రక్రియలో మూడు వారాలపాటు అవకాశం కల్పించాలి. అత్యవసర సందర్భంలో గడువు పది రోజులు ఇవ్వొచ్చు. కానీ ఇక్కడ వారం మాత్రమే ఇచ్చారు. 
»  టెండర్లలో పాల్గొనే వాళ్లు ప్లాంటు తయారీదారులై ఉండాలా? లేక నమోదైన పంపిణీదారుడై ఉండాలా? లేక చిన్నపాటి సరఫరాదారుడై ఉన్నా సరిపోతుందా? అనేదానిపై స్పష్టత లేదు.  
»   ఆర్వో ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి నాణ్యత ప్రమాణాలతోపాటు టెక్నికల్‌ డ్రాయింగ్, డిజైన్‌ తప్పనిసరిగా ప్రకటించాలి. కానీ అలాంటిది లేదు. 
» సాధారణంగా మిషనరీ, ఇతర పరికరాల కొనుగోలు విషయంలో తప్పనిసరిగా ఆర్థిక నిబంధనలు ప్రస్తావించాలి. టెండరు నిబంధనల్లో సాల్వెన్సీ సర్టిఫికెట్‌ అంశం లేకపోవడం గమనార్హం. 
»  ప్లాంటు ఏర్పాటుకు సంబంధించిన కాలపరిమితి, వారంటీ వివరాలపై స్పష్టత లేదు.  
» బిడ్డర్‌కు వార్షిక టర్నోవర్‌ రూ.10 కోట్లు లేదా సగటున రూ.7 కోట్ల ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. కానీ కాంట్రాక్టు పరిమితి రూ.13.99 కోట్ల విలువ ఉండటంతో నిర్దేశించిన టర్నోవర్‌తో ఎలా సాధ్యమవుతుందనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు విలువకు కనీసం ఆరు రెట్లు అధికంగా టర్నోవర్‌ ఉండాలని నిబంధనలున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)