Breaking News

రేపు ‘హ్యామ్‌’ టెండర్లు

Published on Thu, 10/16/2025 - 04:22

సాక్షి, హైదరాబాద్‌: హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హ్యామ్‌) ప్రాజెక్టులో భాగంగా పంచాయతీరాజ్‌ రోడ్ల అభివృద్ధికి శుక్రవారం టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మొదటిదశలో 17 ప్యాకేజీల కింద 96 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,162 రహదారులు (7,449.50 కిలోమీటర్ల పొడవుతో) నిర్మించనున్నారు. హ్యామ్‌ ప్రాజెక్టుల కోసం.. టెండర్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. 

17 ప్యాకేజీలకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు పీఆర్‌ ఈఎన్‌సీ జోగారెడ్డి ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారమే నోటీసు ద్వారా టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి..టెండర్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. 

హ్యామ్‌ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ రహదారులు కొత్త దశలోకి ప్రవేశిస్తాయని, జాతీయ, అంతర్జాతీయ రహదారి నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్టు టెండర్లలో పాల్గొనాలని సీతక్క కోరారు. ఈ ప్రాజెక్ట్‌ అమలుతో గ్రామీణ రహదారి సదుపాయాలు మరింత పటిష్టమై గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ఈ విధానం ద్వారా గ్రామీణ రహదారుల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, రవాణా సౌకర్యాలు విస్తృతంగా మెరుగుపడతాయని తెలిపారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)