Breaking News

మిస్‌ యూనివర్స్‌లో.. తెలుగు అందాలు

Published on Mon, 06/09/2025 - 01:31

మరో ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఫ్యాషన్‌ ఈవెంట్‌కు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సారి నిర్వహించనున్న మిస్‌ యూనివర్స్‌ పోటీలకు సంబంధించి మిస్‌ ఇండియా ఎంపికకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రం నుంచి మిస్‌ యూనివర్స్‌ స్టేట్‌గా ఎంపిక చేసి, మిస్‌ యూనివర్స్‌ ఇండియా పోటీకి పంపిస్తారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి మిస్‌ యూనివర్స్‌ తెలంగాణగా కశ్వి, మిస్‌ యూనివర్స్‌ ఆంధ్రప్రదేశ్‌గా ప్రకృతి ఎంపిక అయ్యారు. హైదరాబాద్‌ అజీజ్‌ నగర్‌లోని ధారా రిసార్ట్‌లో నిర్వహించిన మిస్‌ యూనివర్స్‌ గ్రాండ్‌ ఫినాలేలో ఈ అందాల ముద్దుగుమ్మలను ఎంపిక చేశారు.  – సాక్షి, సిటీ బ్యూరో

మిస్‌ యూనివర్స్‌ ఎంపికలో భాగంగా నిర్వహించిన గ్రాండ్‌ ఫినాలే కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి 30 మంది పోటీదారులు పాల్గొని ర్యాంప్‌ వాక్‌ చేసి అహూతులను అలరించారు. డిజైనర్‌ చారు పరాశర్, గత ఏడాది మిస్‌ యూనివర్స్‌ రన్నర్‌ అప్‌ రూపూజనే విసో, మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఫ్రాంచైజ్‌ హెడ్‌ అంజద్‌ ఈ షోకి జడ్జిలుగా వ్యవహరించారు. ఈ గ్రాండ్‌ ఫినాలేలో తెలంగాణ రన్నరప్‌లుగా సృష్టి, రితిక నిలువగా.. సలోని, తనుశ్రీ ఆంధ్రప్రదేశ్‌ పేజెంట్‌ రన్నరప్‌లుగా నిలిచారు. ఈ ఫ్యాషన్‌ ఈవెంట్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు, పలువురు వ్యాపారవేత్తలు హాజరయ్యారు.  

వనరుల వల్లే.. 
హైదరాబాద్‌లో ఉన్న వనరులు సమయానుకూలంగా ఉన్నందుకే ఈ షోను కేవలం రోజుల వ్యవధిలో సూపర్‌ సక్సెస్‌ చేయగలిగామని తెలంగాణ ఎడిషన్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ గారపాటి తెలిపారు. 

రేస్‌లో తెలుగు అమ్మాయిలు.. 
మిస్‌ వరల్డ్‌ పోటీల తర్వాత అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా మిస్‌ యూనివర్స్‌ పేజెంట్‌కి హైదరాబాద్‌ నగరం అన్ని విధాలుగా సహకరించిందని ఈవెంట్‌ నిర్వాహకురాలు, ఆంధ్రప్రదేశ్‌ ఎడిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సునీత తెలిపారు. చాలా తక్కువ సమయమే ఉన్నా.. పోటీదారులు అందరూ చాలా శ్రమించి అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలను చూపారని కొనియాడారు. వారం రోజుల పాటు జరిగిన ఫ్యాషన్, టాలెంట్, డ్రెస్సింగ్‌ వంటి విభిన్న రౌండ్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది పాల్గొని తమ నైపుణ్యాలను గ్లామర్‌ ఇమేజ్‌ను అద్భుతంగా ప్రదర్శించారని పేర్కొన్నారు. 

గతంతో పోలిస్తే తెలుగు అమ్మాయిలు మోడలింగ్‌లో రాణిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పేజెంట్‌లో తమ సత్తా చాటుతున్నారు. ఈసారి మిస్‌ యూనివర్స్‌ ఇండియా ఎంపికలో తెలుగు మోడల్స్‌ టాప్‌లో ఉన్నారు. ఈ గ్లోబల్‌ పేజెంట్‌కు పోటీనిచ్చేలా మన అమ్మాయిలకు ప్రత్యేక శిక్షణ అందించాం. ఇందులో భాగంగా విదేశాల్లో మోడట్స్‌కు ట్రైనింగ్‌ ఇచ్చే ప్రముఖ బ్యూటీ పేజెంట్స్‌ ట్రైనర్, కొరియోగ్రాఫర్‌ ఆంటోనీ గుంజ్వాలెస్‌తో శిక్షణ అందించాం.

విజేతగా నిలవడమే లక్ష్యం.. 
మిస్‌ యూనివర్స్‌ ఇండియాతో పాటు, మిస్‌ యూనివర్స్‌లోనూ విజేతగా నిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. వారం రోజుల పాటు జరిగిన రౌండ్స్‌ మరింత అవగాహన కల్పించాయి.  – కశ్వి, మిస్‌ యూనివర్స్‌ తెలంగాణ

మన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం.. 
ఈసారి మిస్‌ యూనివర్స్‌లో తెలుగు అమ్మాయిల సౌందర్యాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం. ఈ గ్లోబల్‌ పేజెంట్‌కు తగినట్టుగా అన్ని అంశాల్లో శిక్షణ తీసుకున్నాను. నా చిరకాల కోరికకు కొద్ది దూరంలో ఉన్నాను. తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు. – ప్రకృతి, మిస్‌ యూనివర్స్‌ ఆంధ్రప్రదేశ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)