Breaking News

పోషకలోపం.. ఊబకాయం!

Published on Wed, 06/04/2025 - 01:24

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 22 ఏళ్ల యువతలో ఒకవైపు స్థూలకాయం పెరుగుతుండగా మరోవైపు పోషకాహార లోపం కూడా తీవ్రంగా కనిపిస్తోంది. దీన్ని నిపుణులు ‘డబుల్‌ బర్డెన్‌ ఆఫ్‌ మాల్‌న్యూట్రిషన్‌’గా పేర్కొంటున్నారు. తెలంగాణ యువత ఆరోగ్య పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నట్లు ‘యంగ్‌ లైవ్స్‌’రౌండ్‌–7 సర్వే (2023–24) ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం 22 ఏళ్ల యువతలో 19 శాతం మంది అధిక బరువు/ఒబేసిటీతో ఉండగా 29 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. 2016తో పోలిస్తే స్థూలకాయం రెండింతలైంది. 

అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో స్థూలకాయం ఎక్కువగా (18.8%) కనిపిస్తోంది. పురుషుల్లో ఇది 14 శాతంగా ఉంది. మధుమేహం, గుండెజబ్బుల వంటి ప్రమాదాలకు దీన్ని కేంద్రంగా నిపుణులు గుర్తించారు. ఇప్పటికే 22.7% మహిళలు హై కార్డియోవ్యాసు్కలర్‌ రిస్‌్కలో ఉన్నారని హెచ్చరిస్తున్నారు. 

ఇంతకంటే ఆందోళనకరమైన విషయం ఏమిటంటే పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా తెలంగాణలో 29 శాతంగా ఉన్నట్లు సర్వే తేల్చింది. అందులో గ్రామీణ యువతలో తక్కువ బరువు ఉన్నవారి శాతం 30.9% కాగా.. పట్టణాల్లో ఇది 23.8% శాతంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో, తల్లులు తక్కువ చదువుకున్న కుటుంబాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది.

మానసిక ఒత్తిడిలోయువత 
తెలంగాణలో వివిధ కారణాల వల్ల యువతలో 2023 నాటికి 71.3 శాతం మోస్తరు స్థాయి ఒత్తిడికి గురవుతున్నారని సర్వేలో వెల్లడైంది. పెద్దల్లో ఇది 68 శాతంగా ఉంది. వారిలో పురుషులు 66.7 శాతంగా ఉంటే మహిళలు 75.9 శాతంగా ఉన్నారు. ఇక 22.6% మందిలో మితమైన ఆందోళన, 17.47% మందిలో మితమైన డిప్రెషన్‌ లక్షణాలు బయటపడ్డాయి. 

మహిళలకంటే పురుషులు తక్కువ మానసిక సమస్యలకు గురవుతున్నట్లు గణాంకాల ద్వారా తేలింది. పట్టణ యువతలో వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. కోవిడ్‌ తరువాత భావోద్రేకం లక్షణాలు 1.5 శాతం పెరిగినట్లు సర్వే తేల్చింది. కరోనా తర్వాత ఆరోగ్యంగా ఉండాలనే అభిలాష ప్రజల్లో పెరిగిందని.. గతంలో 23 శాతం మందే ఐదు రకాల ఆహార పదార్థాలు తీసుకోగా ఇప్పుడు వారి సంఖ్య 37 శాతానికి చేరినట్లు పేర్కొంది. 

అక్కడలా.. ఇక్కడిలా..
సామాజిక, ఆర్థిక స్థితిగతులు కూడా వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు సర్వేలో తేలింది. సామాజికంగా దిగువస్థాయి వర్గాల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉండగా ఆరోగ్యంపై సరైన అవగాహన, వైద్యం లేకపోవడం వల్ల ఈ సమస్య ఏటా ఎక్కువవుతోంది. 

అదే సమయంలో ధనవంతుల ఇళ్లలో ఊబకాయ సమస్య ఎక్కువగా ఉంటుండగా పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య చాలా తక్కువ అని తేలింది. 2016లో ధనవంతుల ఇంటి యువతలో స్థూలకాయం 30.6% ఉండగా.. పేదల్లో ఇది 14.0% మాత్రమే. అలాగే పేదల్లో తక్కువ బరువుతో 36.1 శాతం మంది ఉండగా ధనవంతుల్లో అది 21.5 శాతంగా ఉంది. 

విద్యా స్థాయిల తేడాల వల్ల కూడా.. 
తల్లుల విద్యాస్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, వారి పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉన్నాయని సర్వే స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు తల్లికి పదేళ్లకుపైగా చదువు ఉంటే వారి పిల్లల్లో తక్కువ బరువు కలిగి ఉన్న వారు 24.1% ఉండగా స్థూలకాయం 27.6% వరకు ఉంది. విద్య, ఆర్థిక స్థితి, మహిళా సంక్షేమం ఇవన్నీ పోషకాహారం, పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం పాఠశాల స్థాయిలో పోషకాహారం, ఆరోగ్య విద్య, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే పేద కుటుంబాలకు ప్రత్యేక ఆహార భద్రత కార్యక్రమాలు మరింత బలపరచాల్సిన అవసరం ఉంది.  

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)