Breaking News

TSRTC: టార్గెట్‌ రూ.4,953 కోట్లు.. వచ్చింది రూ.6,055 కోట్లు

Published on Sun, 03/19/2023 - 08:13

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖ గతంలో ఎన్నడూ లేనంత భారీ ఆదాయాన్ని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 17వ తేదీ నాటికి రూ.6,055 కోట్ల రెవెన్యూతో కొత్త రికార్డు సృష్టించింది. మార్చి నెలాఖరుకు ఈ మొత్తం రూ.6,285 కోట్లకు చేరుతుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4,953 కోట్ల ఆదా­యాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, దాని­కి మించి రూ.వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఆదాయం సమకూరింది.

గతేడాది ఈ మొత్తం రూ.3,971 మాత్రమే కావటం గమనార్హం. ఖజానాను నింపే శాఖలపై ఇటీవల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆదాయాన్ని పెంచేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకునే క్రమంలో ప్రభుత్వం, మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేసి వరుస సమీక్షలతో అధికారులను పరుగెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో, రవాణా శాఖ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్‌ సహా కొన్ని ట్యాక్స్‌లను పెంచి మరీ ప్రభుత్వ ఖజానాకు మెరుగైన మొత్తాన్ని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది.

కోవిడ్‌ నేపథ్యంలో గత రెండేళ్లుగా ట్రాన్స్‌పోర్టు వాహనాల యజమానులు పన్నులు సరిగా కట్టడం లేదు. ప్రస్తుతం అలాంటి వారిని గుర్తించి బకాయి పడ్డ పన్నులు సహా పెనాల్టీలను వసూలు చేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రూ.54.21 కోట్ల పన్ను బకాయిలు, రూ.9.37 కోట్ల పెనాలీ్టలు వసూలు చేశారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 1.53 కోట్లకు చేరుకుంది. విలాసవంతమైన వాహనాల సంఖ్య కూడా బాగా పెరిగింది. వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌ రూపంలో ఆదాయం భారీగా పెరిగింది.

ఇక ఫ్యాన్సీ నంబర్ల వేలాన్ని కూడా రవాణాశాఖ పోత్సహిస్తోంది. లైఫ్‌ ట్యాక్స్‌ రూపంలో రూ.4,401.75 కోట్లు, త్రైమాసిక పన్ను రూపంలో రూ.825.28 కోట్లు, ఫీజుల రూపంలో రూ.527.78 కోట్లు, యూజర్‌ చార్జీల రూపంలో రూ.129.10 కోట్లు, డిటెక్షన్‌ పద్దు ద్వారా 171.09 కోట్లు సమకూరింది. శనివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌.. రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, కమిషనర్‌ బుద్ధప్రకాశ్‌ జ్యోతి, జేటీసీలతో ఆదాయంపై సమీక్షించారు. లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని సాధించిపెట్టినందుకు అధికారులను మంత్రి అభినందించారు.
చదవండి: 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు.. అంతర్జాతీయ వేదికపై మెరిసిన అగ్గిపెట్టె చీర

Videos

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)