Breaking News

అత్యధిక స్టార్టప్‌లున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ

Published on Sun, 05/14/2023 - 03:30

హఫీజ్‌పేట్‌: దేశంలోనే అత్యధిక స్టార్టప్‌లున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని టీహబ్‌ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు తెలిపారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని షర్టన్‌ హోటల్‌లో సీఐఓ క్లబ్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ టెక్నాలజీ కాంక్లేవ్‌–2023 శనివారం జరిగింది. ఈ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 7,500 స్టార్టప్‌లున్నాయన్నారు.

వ్యాక్సినేషన్‌ ఉత్పత్తిలోనూ కొత్తగా ఏర్పడిన తెలంగాణే టాప్‌ రాష్ట్రంగా కొనసాగుతోందని తెలిపారు. ఈజీ ఆఫ్‌ బిజినెస్‌లో, బెస్ట్‌ ఇన్నోవేషన్‌ స్టేట్‌గానూ తెలంగాణ గుర్తింపు పొందిందన్నారు. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ ఐటీ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలు.. అమెరికా తర్వాత తమ అతి పెద్ద కేంద్రాలను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు.

వ్యవసాయంలోనూ టెక్నాలజీని ఉపయోగిస్తూ తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. సీఐఓ క్లబ్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ 2018లో సీఐఓ క్లబ్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఐఎస్‌బి అసోసియేట్‌ డైరెక్టర్‌ అజయ్‌ సింగ్, సీఐఓ క్లబ్‌ ప్రతినిధులు ఉమేష్‌ మెహతా, 14 చాప్టర్ల సీఐఓలు, సభ్యులు పాల్గొన్నారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)