Breaking News

1,000 పాఠశాలల్లో ప్రీప్రైమరీ

Published on Sun, 07/27/2025 - 05:12

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్య అమలుకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను నిర్వహించాలని ఇప్పటికే సూచించగా.. తాజాగా మరో 790 పాఠశాలలను గుర్తిస్తూ వాటిల్లో ప్రీప్రైమరీ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఆయా పాఠశాలల జాబితాను కూడా వెల్లడించింది. ప్రీ ప్రైమరీ అమలుకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.33 కోట్లు కేటాయించింది. తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ)లో వినియోగించని నిధి నుంచి రూ.22.62 కోట్లు తీసుకోవాలని, మిగిలిన మొత్తాన్ని సమగ్రశిక్ష నుంచి విడుదల చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. కాగా ప్రీ ప్రైమరీ నిర్వహణ మార్గదర్శకాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపారు.  

ఆహ్లాదపరిచే గది.. పోషకాహారం.. మధ్యాహ్న భోజనం
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. నిర్దేశించిన పాఠశాలలో ప్రీ ప్రైమరీ కోసం ప్రత్యేకంగా తరగతి గది కేటాయించాలి. ఇది చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చేలా ఉండాలి. అంగన్‌వాడీల్లో అందించే పోషకాలతో పాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా అందించాలి.

నాలుగేళ్లు నిండిన చిన్నారులను మాత్రమే ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చుకోవాలి. అంటే వచ్చే విద్యా సంవత్సరం (2026–27)లో ఒకటో తరగతిలో చేరే పిల్లలకు మాత్రమే ప్రవేశం కలి్పస్తారు. ప్రీ ప్రైమరీలో చేరే విద్యార్థి వివరాలను యూడైస్‌లో రికార్డు చేస్తారు.

ఒక టీచర్‌.. ఒక ఆయా 
⇒ తరగతి నిర్వహణకు ప్రత్యే     కంగా 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల     మధ్య వయసున్న ఒక టీచర్, ఒక ఆయాను పూర్తి తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలి. నోటిఫికేషన్‌ ద్వారా నియామకం చేపట్టాలి. వయో పరిమితి సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాలి. టీచర్‌ కనీసం ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసి ఉండాలి. ఆయా కనీసం ఏడో తరగతి చదివి ఉండాలి. ప్రీ ప్రైమరీ కోర్సు చేసిన వారికి, స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. 

⇒ తరగతి గదిలో ఇండోర్, అవుట్‌ డోర్‌ క్రీడా సామగ్రి ఏర్పాటు చేయాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆమోదంతో వసతులు కల్పించాలి. 
⇒ ఎన్‌ఈపీ (నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ)–20కు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. 
⇒ రోజువారీ హాజరు స్వీకరించాలి. అంగన్‌వాడీల ద్వారా స్నాక్స్‌ పంపిణీ, మధ్యాహ్న భోజనం అమలు చేయాలి. 

⇒ జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ ఆమోదంతోనే సరుకులు, వస్తువులు కొనుగోలు చేయాలి 
⇒ ఈ తరగతి నిర్వహణకు స్థానికులు, తల్లిదండ్రుల సలహాలను స్వీకరించాలి 
⇒  పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉండాలి. రోజువారీ నిర్వహణ, పౌష్టికాహారం, ఆరోగ్యం, రక్షణ తదితరాలకు హెచ్‌ఎం బాధ్యత వహించాలి. 
⇒  ఈ తరగతుల నిర్వహణను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ     అధికారులు సమన్వయం చేస్తారు.
 

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)