Breaking News

ఎక్స్ఛేంజీల విద్యుత్‌తో రూ.982 కోట్లు ఆదా చేశాం

Published on Fri, 02/07/2025 - 05:37

సాక్షి, హైదరాబాద్‌: థర్మల్‌ విద్యుత్‌కన్నా తక్కువ ధరకు లభించే పవర్‌ ఎక్స్ఛేంజీల విద్యుత్‌ను కొనుగోలు చేయడం ద్వారా 2023 డిసెంబర్‌ నుంచి 2025 జనవరి మధ్య రూ. 982.66 కోట్లు ఆదా చేశామని ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పవర్‌ ఎక్స్ఛేంజీల్లో తక్కువ ధరకు విద్యుత్‌ లభిస్తున్న సమయాల్లో విద్యుత్‌ వేరియబుల్‌ కాస్ట్‌ అధికంగా ఉన్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను బ్యాక్‌డౌన్‌ చేసి ఈ మేరకు డబ్బు ఆదా చేశామని పేర్కొన్నారు. దీనివల్ల వినియోగదారులపై ఆ మేరకు ఆర్థిక భారం తప్పిందన్నారు. దీన్ని కేంద్రం సైతం గుర్తించి తెలంగాణ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ను దేశంలోనే అత్యుత్తమైన ఎస్‌ఎల్డీసీగా ఎంపిక చేసి గతేడాది డిసెంబర్‌ 14న పురస్కారం అందించిందని గుర్తుచేశారు.గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో తయారైన విద్యుత్‌ యూనిట్‌ 

ధర సగటున రూ. 3.97 నుంచి రూ. 4.18గా ఉండటంతో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను బ్యాక్‌డౌన్‌ (ఉత్పత్తి తగ్గించి) చేసి పవర్‌ ఎక్స్ఛేంజీల నుంచి రూ. 2.69 నుంచి రూ. 2.82 సగటు ధరతో విద్యుత్‌ కొన్నామని కృష్ణ భాస్కర్‌ ఆ ప్రకటనలో వివరించారు. దీంతో డిసెంబర్‌లో రూ. 196.68 కోట్లు, జనవరిలో రూ. 185.27 కోట్లు ఆదా అయ్యాయన్నారు. దీర్ఘకాలిక విద్యుత్‌ ఒప్పందాల ద్వారా 9,134 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే లభ్యతగా ఉండటంతో విద్యుత్‌ కొనుగోళ్లు తప్పవన్నారు. 

విద్యుత్‌ డిమాండ్‌ కొత్త రికార్డు 
రాష్ట్రంలో గురువారం గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో పెరిగి ఏకంగా 15,752 మెగావాట్లకు ఎగబాకింది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధిక గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌. గతేడాది మార్చి 8న ఏర్పడిన 15,523 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ ఇప్పటివరకు అత్యధికంకాగా దాన్ని తాజాగా రాష్ట్రం అధిగమించిందని ట్రాన్స్‌కో సీఎండీ డి.కృష్ణభాస్కర్‌ పేర్కొన్నారు. వేసవిలో గరిష్ట డిమాండ్‌ 17,000 మెగావాట్లకు పెరిగినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లతో నష్టమే: ఎం.వేణుగోపాల్‌రావు 
ట్రాన్స్‌కో సీఎండీ వాదనను విద్యుత్‌రంగ నిపుణుడు ఎం.వేణుగోపాల్‌రావు తోసిపుచ్చారు. ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్ల కోసం అధికంగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఎక్స్ఛేంజీల నుంచి యూనిట్‌కు రూ. 2.82 ధరతో విద్యుత్‌ కొనుగోలు చేయగా ఆ మేరకు బ్యాక్‌డౌన్‌ చేసిన విద్యుత్‌ స్థిర చార్జీ యూనిట్‌కు  రూపాయిన్నరగా ఉన్నా మొత్తం యూనిట్‌ విద్యుత్‌ ధర రూ. 4.32కు పెరిగిపోతుందన్నారు. మరోవైపు బ్యాక్‌డౌన్‌ చేసిన విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ. 4.15 మాత్రమే ఉండటంతో వాస్తవానికి డిస్కంలు యూనిట్‌కు అదనంగా 0.17 పైసలు నష్టపోయాయని తేల్చిచెప్పారు. బ్యాక్‌డౌన్‌ చేసి ఉత్పత్తి తగ్గించిన విద్యుత్‌కు సంబంధించిన మొత్తం స్థిర ధరలు చెల్లించాల్సి ఉంటుందని.. సగటు స్థిర చార్జీలు కాదన్నారు. దీనికితోడు ఎక్స్ఛేంజీల నుంచి విద్యుత్‌ కొంటే ఇంటర్‌స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు, ట్రాన్స్‌మిషన్‌ నష్టాలు భరించాల్సి ఉంటుందన్నారు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)