Breaking News

తెలంగాణలో నేటి నుంచి కుటుంబ సర్వే

Published on Wed, 11/06/2024 - 01:14

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం నుంచే ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతంలో ఇంటింటికి తిరిగి కుటుంబాల సమగ్ర వివరాలను నమోదుచేస్తారు. ఈ సర్వేలో 85 వేల మంది ఎన్యుమరేటర్లు పాల్గొంటున్నారు.

ప్రతి పదిమంది ఎన్యుమ రేటర్లకు ఒక పరిశీలకుడు చొప్పున 850 మందిని ప్రభుత్వం నియమించింది. ఎన్యుమరేటర్లలో 32 వేల మంది టీచర్లు ఉన్నారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లకు, పరిశీలకులకు, పర్యవేక్షణ అధికారులకు విడతలవారీగా జిల్లా కలెక్టర్లు శిక్షణ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే టీచర్లు మధ్యా హ్నం భోజనం తర్వాత సర్వే ప్రక్రియను ప్రారంభిస్తారు. సర్వే ప్రక్రియలో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందితోపాటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, గెస్ట్‌ టీచర్లను సైతం నియమించారు.  

పూర్తి వివరాలు సేకరణ 
ఈ సర్వే రెండు భాగాలుగా సాగుతుంది. మొదటి విభాగం(పార్ట్‌–1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. సాధారణ వివరాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. రెండో విభాగం (పార్ట్‌–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలుంటాయి. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, రేషన్‌ కార్డు, నివాసగృహం, తాగునీరు తదితర ప్రశ్నలు అడుగుతారు. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుండగా... ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు.

175 కుటుంబాలు ఒక బ్లాకు
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను సులభతరంగా చేపట్టేందుకు 175 ఇళ్లను ఒక బ్లాకుగా విభజించి ఎన్యుమరేటర్లకు కేటాయించారు. ఈ బ్లాకుల విభజన ప్రక్రియ జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో జరిగింది. సెన్సెస్‌ డైరెక్టర్‌ నుంచి ఎన్యు మరేషన్‌ బ్లాక్‌(ఈబీ) మ్యాపులు తీసుకుని బ్లాకులను విభ జించారు. ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన బ్లాకులోని ప్రతి ఇంటిని సర్వే చేయాలి. అనంతరం సర్వే పూర్తి చేసినట్లు స్టిక్కర్‌ అంటిస్తారు. ఎన్యుమరేటర్లు సర్వే పూర్తి చేసిన తర్వాత ఆ సమాచారంలోని 10 శాతం కుటుంబాలను ర్యాండమ్‌గా ఎంపిక చేసి వాటిని సూపర్‌వైజర్లు మరోమారు తనిఖీ చేసి ఎన్యుమరేటర్‌ పనితీరును అంచనా వేస్తారు.

చ‌ద‌వండి: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే.. ఈ వివరాలు తెలుసుకోండి

ఎన్యుమరేటర్లు సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. సేకరించిన కుటుంబాల వివరాలను ఏ రోజుకారోజు కంప్యూటర్లలో ఎంట్రీ చేస్తారు. ఈ ఎంట్రీనే అత్యంత కీలం కానుంది. డేటా ఎంట్రీలో పొరపాట్లు దొర్లితే సర్వే స్వరూపం మారిపోతుంది. అందుకే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సర్వేకు ప్రతి జిల్లాలో నోడల్‌ అధికారిగా అదనపు కలెక్టర్‌ను ప్రభుత్వం నియమించింది. సర్వే నిర్వహణలో రోజువారీ పురోగతిని ప్రణాళిక శాఖకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల లోపు పంపాలి. ఈ నెలాఖరు నాటికి సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఆ మేరకు జిల్లా కలెక్టర్లు కార్యాచరణ సిద్ధం చేశారు.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)