Breaking News

అతితక్కువ పనిదినాల్లో రెండోస్థానం

Published on Sun, 01/11/2026 - 02:22

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపా ధి హామీ పథకం కింద నమోదైన అత్యల్ప సగటు పనిదినాల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. ఉపాధి హామీ చట్టం 2025–26 సంవత్సరంలో 9 నెలల్లో 27 అత్యల్ప సగటు పనిదినాలతో ఉత్తరాఖండ్‌ ప్రథమ స్థానంలో నిలవగా, 28 రోజులతో తెలంగాణ రెండో స్థానంలో సాధించింది. 2025లో ఏప్రిల్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 దాకా... ప్రతి కుటుంబానికి సగటున 28 రోజుల సగటు పనులను నమోదు చేసింది. ఇదే సమయంలో 100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య కూడా తక్కువగానే ఉంది.

తెలంగాణలో కేవలం ఆరు వేల కుటుంబాలు మాత్రమే వంద రోజుల పనిని సాధించాయి. మునుపటి సంవత్సరాలతో పోలిస్తే... ఉపాధి కల్పనలో సవాళ్లు పెరగడంతో పర్సన్‌ డేస్‌ గణనీయంగా తగ్గాయి. తెలంగాణలో దాదాపు 20 లక్షల కుటుంబాలు ఈ పథకంలో పాల్గొన్నాయి. తాజాగా 18 ప్రధాన రాష్ట్రాల నుంచి సేకరించిన డేటాను విశ్లేíÙంచగా వివిధ అంశాలు వెల్లడయ్యాయి. వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఉపాధి పథకం ‘వికసిత్‌ భారత్‌–గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవిక మిషన్‌ (గ్రామీణ్‌) చట్టం’గా అమల్లోకి రానున్న విషయం తెలిసిందే.  

అంతకు ముందూ క్షీణతే... 
2025లో ఆరునెలల కాలంలో (ఏప్రిల్‌ నుంచి సెపె్టంబర్‌ దాకా) మొత్తం ఉపాధి హామీ పని దినాల్లో 47.6 శాతం మేర (గత ఏడాదితో పోలిస్తే) తగ్గుదల నమోదైంది. తెలంగాణలో ఉపాధి కల్పన గణనీయ తగ్గుదల కనిపించే జూలై–ఆగస్టు నెలల్లోనే కాకుండా.. ఈసారి వేసవి తీవ్రత అధికంగా ఉండటంతో ఏప్రిల్‌–మే నుంచే ఈ క్షీణత ప్రారంభమైంది. ఈ తరువాతి నెలల్లోనూ పునరుద్ధరణ కాలేదు.

ఏప్రిల్‌–సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా పనిదినాల తగ్గుదల 10.4% మాత్రమే ఉండగా, తెలంగాణలో మాత్రం దానికి నాలుగు రెట్లు అధికంగా ఉండటం ఆందోళనకరంగా మారింది. గత ఏడాది ఇదే సమయంలో ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య 25.33 లక్షల నుంచి 19.94 లక్షలకు (21.3% తగ్గుదల) తగ్గిపోయింది. అలాగే, ప్రతీ కుటుంబానికి లభించిన సగటు పని దినాలు 41 రోజుల నుంచి 27 రోజులకు పడిపోయాయి. ఒక కుటుంబానికి ఏడాదికి రూ.1,686 తక్కువ ఆదాయం (–19.4%) లభించింది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)