Breaking News

సెల్‌ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండోస్థానంలో తెలంగాణ

Published on Wed, 05/22/2024 - 04:51

సాక్షి, హైదరాబాద్‌:  చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్ల జాడను తిరిగి కనిపెట్టి రికవరీ చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. కేంద్ర టెలీకమ్యూనికేషన్స్‌కు చెందిన సీఈఐఆర్‌ (సెంట్రల్‌ ఎక్విప్మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌) పోర్టల్‌ సాంకేతికతను వినియోగించి గత 369 రోజుల్లో తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 30,049 మొబైల్‌ ఫోన్ల జాడను కనుగొన్నారు.

ఈ మేరకు సీఐడీ ఇన్‌చార్జి అదనపు డీజీ మహేశ్‌భగవత్‌ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్‌ స్టేషన్లలో సీఈఐఆర్‌ సాంకేతికను వినియోగిస్తున్నట్లు తెలిరు. గతేడాది ఏప్రిల్‌ 19న తెలంగాణ రాష్ట్రంలో సీఈఐఆర్‌ను పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టి, మే 17న పూర్తిస్థాయిలో ప్రారంభించారు. రోజుకు సరాసరిన 76 మొబైల్‌ ఫోన్ల చొప్పున జాడ కనిపెట్టినట్లు మహేశ్‌ భగవత్‌ పేర్కొన్నారు. 

ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 4,869 మొబైల్‌ ఫోన్లు, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 3,078 మొబైల్‌ ఫోన్లు, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 3,042 మొబైల్‌ ఫోన్లు, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 1,919 మొబైల్‌ ఫోన్లు గుర్తించినట్టు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో 35,945 ఫోన్ల రికవరీతో కర్ణాటక తొలిస్థానంలో ఉందని తెలిపారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)