జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసులో​ మరో ట్విస్ట్‌!

Published on Mon, 10/28/2024 - 15:47

సాక్షి, హైదరాబాద్‌: జన్వాడలోని ఫామ్‌ హౌస్‌లో రేవ్‌ పార్టీ వ్యవహారం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. రేవ్‌ పార్టీ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో​, స్పందించిన రాజ్‌ పాకాల.. విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజులు సమయం కావాలని కోరారు.

జన్వాడ ఫామ్‌ హౌస్‌ కేసుకు సంబంధించి రాజ్‌ పాకాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బీఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం మోకిల పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేవ్‌ పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని.. నేడు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాజ్‌ పాకాల..అడ్రస్‌ ఫ్రూఫ్‌, కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని సూచించారు. అయితే, రాజ్‌ పాకాల.. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో మోకిల ఇన్‌స్పెక్టర్‌ పేరుతో ఉన్న నోటీసులను రాయదుర్గంలోని ఓరియన్‌ విల్లాస్‌లో ఆయన నివాసానికి అతికించారు. ఇక, పోలీసుల నోటీసుల నేపథ్యంలో హైకోర్టును రాజ్‌ పాకాల ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో ఆయన కోరారు. మరోవైపు.. పోలీస్ విచారణకు హాజరు అవ్వడానికి రెండు రోజులు గడువు కావాలని న్యాయవాది ద్వారా మోకిల పోలీసులకు ఆయన లేఖ పంపారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)