Breaking News

‘ఆపరేషన్‌ కవచ్‌’.. అర్ధరాత్రి పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Published on Sat, 12/06/2025 - 08:04

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు మరింత పటిష్టం చేసేందుకు పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పోలీసులు ‘ఆపరేషన్‌ కవచ్‌’ (Operation Kavach) పేరుతో అకస్మాత్తుగా నాకాబందీ చేపట్టారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నేతృత్వంలో శుక్రవారం రాత్రి దాదాపు 5 వేల మంది పోలీసులతో ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా సీపీ సజ్జనార్‌.. కీలక సూచనలు చేశారు.

ఈ తనిఖీల్లో ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌, టాస్క్‌ ఫోర్స్‌, ఏఆర్‌, కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు పాల్గొన్నాయి.  ప్రజా భద్రతకు చేస్తున్న తనిఖీలకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ కోరారు. అనుమానాస్పద కదలికలపై డయల్‌ 100కి సమాచారం ఇవ్వాలని సూచించారు. కమిషనరేట్‌ చరిత్రలో ఇంత మంది పోలీసులతో నాకాబందీ చేపట్టడం ఇదే తొలిసారి.

అనంతరం, సజ్జనార్‌ ట్విట్టర్‌ వేదికగా..‘హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా, నేడు రాత్రి 10 గంటల నుంచి 'ఆపరేషన్ కవచ్' (Operation Kavach) పేరుతో నగరవ్యాప్తంగా విస్తృతమైన నాకాబందీని నిర్వహిస్తున్నాము. ​హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నాము. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో లా అండ్ ఆర్డర్ (Law & Order), ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్ మరియు పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి. ​ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరుతున్నాము. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించగలరు. మీ భద్రత - మా బాధ్యత అని తెలిపారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)