Breaking News

తెలంగాణలో బర్డ్‌ ఫ్లూ లేదు.. చికెన్‌ తినొచ్చు: పశు సంవర్ధక శాఖ

Published on Wed, 02/12/2025 - 11:56

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బర్డ్ ఫ్లూ(Bird Flu)  కేసులు నమోదు కాలేదని తెలిపారు తెలంగాణ పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గోపి. ఇతర కారణాలతో కోళ్లు మృతిచెందినట్టు ఆయన వెల్లడించారు. చికెన్‌ తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు.

తెలంగాణ పశు సంవర్థకశాఖ డైరెక్టర్ గోపి తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదు. వరంగల్, ఖమ్మం జిల్లాలో కోళ్ల మృతిపై రక్త నమూనాలను ల్యాబ్స్‌కు పంపించాం. ఇతర కారణాలతో కోళ్లు మృతి చెందినట్లు తేలింది. బర్డ్ ఫ్లూపై పౌల్ట్రీ రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. కోళ్ల ఫారాల చుట్టూ బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలి. కోళ్ల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువ.

ఈ నేపథ్యంలో చికెన్ తినడం వలన ఎలాంటి ఇబ్బంది లేదు. చికెన్, కోళ్లను ఉడికించి తినటం వలన వైరస్ బతికే ఛాన్స్ లేదు. కోళ్ల ఫారాలలో వైరస్ సోకిన కోళ్లకు దగ్గరగా పనిచేసే వారికి స్వల్పంగా దగ్గు, జలుబు వచ్చే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం’ అని చెప్పుకొచ్చారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)