Breaking News

తలసరి విద్యుత్‌లో తెలంగాణ నెంబర్‌ 1.. అసలు నిజం ఇదే!

Published on Wed, 08/16/2023 - 09:03

సాక్షి, హైదరాబాద్‌: దేశమైనా, రాష్ట్రమైనా ప్రగతి­పథంలో ఉందని చెప్పడానికి తలసరి ఆదాయం, తలసరి విద్యుత్‌ వినియోగాన్ని ప్రామాణిక సూచికగా తీసుకుంటారు. అయితే ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్‌ 1 స్థానంలో నిలిచింది. రూ.3,12,398 తలసరి ఆదాయంతో, 2,126 యూనిట్ల తలసరి విద్యుత్‌ వినియోగంతో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది..’అని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మంగళవారం గోల్కొండ కోట సాక్షిగా చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు.

గతంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగానూ సీఎం ఇదే ప్రకటన చేశారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నిజంగానే దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్రం స్వయంగా పార్లమెంట్‌లో ప్రకటించింది. అయితే, తలసరి విద్యుత్‌ వినియోగంలో మాత్రం తెలంగాణ అగ్రస్థానంలో లేదు. 2126 యూనిట్ల తలసరి విద్యుత్‌ వినియోగంతో మనరాష్ట్రం జాతీయస్థాయిలో 10వ స్థానంలో ఉంది.

గత ఫిబ్రవరి 17న సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) ప్రకటించిన ‘అఖిల భారత విద్యుత్‌  గణాంకాలు–2022’ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దేశంలోని మొత్తం 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని 2020–21 వార్షిక విద్యుత్‌ సరఫరా గణాంకాల ఆధారంగా సీఈఏ తాజా నివేదిక ప్రకటించింది. జాతీయస్థాయిలో ఏటా వార్షిక విద్యుత్‌ గణాంకాలను సీఈఏ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నా తెలంగాణ తలసరి విద్యుత్‌ వినియోగంలో ఏడో స్థానంలో ఉందని సీఈఏ నివేదిక పేర్కొంటోంది.  

తప్పుదోవ పట్టిస్తున్న అధికారులు..? 
తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో చేసిన ప్రసంగంలో సీఎం కేసీఆర్‌ అన్నారు. సీఎం ప్రసంగం కోసం సీఎంఓ ఎప్పటికప్పుడు అన్ని శాఖల నుంచి సమాచారం సేకరిస్తుండగా, అధికారులు తప్పుడు వివరాలు అందించి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలున్నాయి.  

వ్యవసాయ విద్యుత్‌లో రాష్ట్రం అగ్రస్థానం  
► రాష్ట్రాల్లో వివిధ కేటగిరీల వారీగా తలసరి విద్యుత్‌ వినియోగాన్ని పరిశీలిస్తే.. 592.24 యూనిట్ల తలసరి వ్యవసాయ విద్యుత్‌ వినియోగంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.  
►గృహ కేటగిరీలో 813.94 యూనిట్ల తలసరి వినియోగంతో గోవా అగ్రస్థానంలో ఉండగా, 340.62 యూనిట్లతో తెలంగాణ 5వ స్థానంలో ఉంది.
►వాణిజ్య కేటగిరీలో 273.11 యూనిట్ల వినియోగంతో గోవా అగ్రస్థానంలో, 128.81 యూనిట్ల విని­యో­గంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది.  
►హెచ్‌టీ కేటగిరీలో పారిశ్రామిక విద్యుత్‌ వినియోగంలో 1163.99 యూనిట్ల వినియోగంతో గోవా ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ 299.19 యూనిట్ల వినియోగంతో పదోస్థానంలో ఉంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)