Breaking News

డాడీ.. లేచి మమ్మల్ని ముద్దు పెట్టుకో

Published on Sat, 03/04/2023 - 10:19

కరీంనగర్: ‘డాడీ మేము స్కూల్‌ నుంచి వచ్చేసరికి నువ్వు వస్తానన్నావు.. హోలీ పండుగ రోజు రంగులు పూసుకొని, ఆడుకుందామన్నావు.. మేము వచ్చాము.. లేచి మమ్మల్ని ముద్దు పెట్టుకో డాడీ.. మమ్మీ మా ఇద్దరినీ పట్టుకొని ఏడుస్తుంది’.. అంటూ ఆ చిన్నారులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సింగ్‌ సోదరుడు శైలేందర్‌సింగ్‌(44) గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. శైలేందర్‌సింగ్‌ బిల్డర్‌. ఆయనకు భార్య సరోజ్‌ఠాగూర్‌, కూతుళ్లు కనీషాసింగ్‌, అనితాసింగ్‌ ఉన్నారు.

భార్యాపిల్లలు హైదరాబాద్‌లో ఉంటుండగా శైలేందర్‌సింగ్‌ గోదావరిఖనిలో కన్‌స్ట్రక్షన్‌ పనుల నిమిత్తం స్థానిక కేసీఆర్‌ కాలనీలోని శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. మూడు రోజులకోసారి హైదరాబాద్‌ వెళ్లి, కుటుంబంతో గడిపి, వస్తుండేవాడు. శుక్రవారం ఉదయం పైఅంతస్తు నుంచి కిందకు వెళ్లేందుకు లిఫ్ట్‌ వద్దకు వెళ్లగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అక్కడున్నవారు పరిగెత్తుకు వచ్చి, పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆయన భార్యాపిల్లలు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. మృతుడి అత్తామామ గుజరాత్‌ నుంచి రావాల్సి ఉంది. అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ప్రముఖుల నివాళి..
శైలేందర్‌సింగ్‌ మృతి వార్త తెలియడంతో గోదావరిఖని పట్టణంలోని ఆయన ఇంటికి పార్టీలకతీతంగా ప్రముఖులు, నాయకులు తరలివచ్చారు. శైలేందర్‌సింగ్‌ సోదరులు అయోధ్యసింగ్‌, మక్కా న్‌సింగ్‌లను పరామర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, కౌశికహరి, కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు బాబ ర్‌సలీంపాషా, కార్పొరేటర్లు శ్రీనివాస్‌, సతీశ్‌కుమార్‌, లత, స్వా మి, ధర్మపురి, కుమారస్వామి, రఘువీర్‌సింగ్‌, మేయర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూ టీ మేయర్‌ అభిషేక్‌రావు ఆయన మృతదేహానికి నివాళి అర్పించారు. హైదరాబాద్‌ నుంచి శైలేందర్‌సింగ్‌ అభిమానులు వచ్చారు. కుటుంబసభ్యులు శైలేందర్‌సింగ్‌ నేత్రాలను దానం చేయాలని నిర్ణయించారు. సదాశయ ఫౌండేషన్‌ ప్రతినిధులకు సమాచా రం ఇవ్వడంతో టెక్నీషియన్‌ ద్వారా నేత్రాలను సేకరించి, హైదరాబాద్‌లోని వాసన్‌ ఐ బ్యాంకుకు తరలించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)