Breaking News

ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోందా?

Published on Sun, 04/20/2025 - 03:35

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోందా? గత రెండు నెలల్లో నమోదైన వినియోగ ధరల సూచీ (కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌) ద్రవ్యోల్బణం ఇదే విషయాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ప్రజల చేతిలో డబ్బులు తగ్గిపోవటంతో వారి కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. మార్చి నెలలో తెలంగాణలో దేశంలోనే అత్యల్పంగా 1.06 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. జాతీయ స్థాయి లో ఇది సగటున 3.34 శాతంగా ఉంది.

ఫిబ్రవరిలో కూడా జాతీయస్థాయిలో ద్రవ్యోల్బణం 3.32 శాతం ఉండగా.. తెలంగాణలో 1.31 శాతం మాత్రమే నమోదైంది. వరుసగా రెండునెలల పాటు అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదు కావటం ప్రమాద సంకేతమేనని నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణ తర్వాత ఢిల్లీ (1.48 శాతం), జార్ఖండ్‌ (2.08 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (2.50 శాతం)లో మార్చిలో తక్కువ ద్రవ్యోల్బణం నమోదైంది.

ఇక అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రాల్లో 6.59 శాతంతో కేరళ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (4.44 శాతం), ఛత్తీస్‌గఢ్‌ (4.25 శాతం) జమ్ముకశ్మిర్‌ (4 శాతం), మహారాష్ట్ర (3.86 శాతం) నిలిచాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2 నుంచి 4 శాతం మధ్యలో ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాలు ఆర్థికపరంగా బాగున్నట్టుగా పరిగణిస్తారు. 

తక్కువ ఉన్నా సమస్యే.. 
పైపై అంచనాలు, అంశాలవారీగా చూస్తే అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా ఉన్నట్లు కనిపించినా.. అందుకు వ్యవస్థీకృతంగా బలీయమైన సమస్యలు కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదు కావటానికి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గుదల, వస్తువులకు డిమాండ్‌ తగ్గడం కారణం కావొచ్చని పేర్కొంటున్నారు. అయితే, రాబోయే నెలల్లోనూ ద్రవ్యోల్బణం తీరుతెన్నులు పరిశీలిస్తే తప్ప ఒక స్పష్టమైన నిర్ధారణకు రాలేమని అంటున్నారు. రానున్న నెలల్లోనూ రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైతే అది వాస్తవ పరిస్థితుల ఆధారంగా జరుగుతుందని భావించవచ్చని చెబుతున్నారు.

వ్యవసాయ రంగమూ దెబ్బతింది
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. వివిధ పథకాల కింద నగదు బదిలీ అంతగా జరగడం లేదు. వ్యవసాయరంగం కూడా కొంతమేర దెబ్బతిన్నది. దీంతో ప్రజలు వస్తువులను కొనలేని పరిస్థితి వచ్చి వాటికి డిమాండ్‌ తగ్గిపోయి, ద్రవ్యోల్బణం తగ్గినట్టుగా కనిపిస్తోంది. జీడీపీ పెరుగుదల రేటు తగ్గింది. తలసరి ఆదాయం కూడా పడిపోవడంతో మార్చిలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. కోవిడ్‌ సమయంలో తప్ప దేశంలో ఎక్కడా జీఎస్టీ వసూళ్లు తగ్గిన సందర్భాలు లేవు.  –డి.పాపారావు, ఆర్థిక విశ్లేషకుడు.    

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)