Breaking News

కొత్తగా 60 అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు

Published on Sat, 10/19/2024 - 06:01

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం భివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని యువతకు స్కిల్‌కోర్సులు అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్థ)లను ఏటీసీ(అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌)లుగా అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఏటీసీలు పరిమిత సంఖ్యలో ఉండగా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒకటి చొప్పున ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏటీసీలు లేని సెగ్మెంట్లను గుర్తిస్తూ... అక్కడ కొత్తగా వాటి ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 59 నియోజకవర్గాల్లో 65 ఏటీసీలున్నాయి.

ఒకట్రెండు చోట్ల రెండేసి ఏటీసీలు ఉండగా, 60 నియోజకవర్గాల్లో మాత్రం వీటి ఊసే లేదు. ఈ నేపథ్యంలో ఏటీసీలు లేని చోట కొత్తగా నెలకొల్పేందుకు కారి్మక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు స్థల లభ్యత, ఇతర వసతులను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు పంపాలని కోరింది. ప్రస్తుతం వరంగల్‌ రీజియన్‌ పరిధిలో 35, హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలో 30 ఏటీసీలు ఉన్నాయి. హైదరాబాద్‌ రీజియన్‌లో ఉన్న వాటిల్లో అత్యాధునిక ట్రేడ్‌లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌ జిల్లాలోని ఆరు ఏటీసీలను ఇప్పటికే మారుతి, హ్యుందాయ్, ఏషియన్‌ పెయింట్స్‌ లాంటి సంస్థలు దత్తత తీసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లోని ట్రేడ్‌లలో చేరేందుకు అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

తాజాగా అన్ని చోట్ల అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ట్రేడ్‌లను అందుబాటులోకి తేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం... 2వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో ఆధునీకరణ పనులు చేపట్టడంతో ఐటీఐ ట్రేడ్‌లకు ఇప్పుడిప్పుడే డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇప్పటికే 20కి పైగా కొత్త ఏటీసీల ఏర్పాటు కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు రూపొందించగా, అవి కార్మిక ఉపాధి కల్పన, శిక్షణ విభాగానికి చేరాయి. అతి త్వరలో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)