TG: నేటి నుంచి జూడాల నిరవధిక సమ్మె

Published on Mon, 06/24/2024 - 07:00

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జూనియర్‌ డాక్టర్లు (జూడా) సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఈ మేరకు జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సీహెచ్‌జీ సాయిశ్రీ హర్ష, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.ఐజాక్‌ న్యూటన్, చైర్‌పర్సన్‌ డాక్టర్‌ డి.శ్రీనా«థ్‌లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

 రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు అంతా ఈ సమ్మెలో పాల్గొంటారని వారు ప్రకటించారు. ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) సేవలు, ఎలక్టివ్‌ సర్జరీలు, వార్డ్‌ డ్యూటీలను పూర్తిగా బహిష్కరిస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో అనేక చర్చలు జరిగినప్పటికీ, తమ డిమాండ్లకు తగిన పరిష్కారం దొరకలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 తప్పని పరిస్థితుల్లోనే ఈ సమ్మెకు దిగాల్సి వస్తోందని, తమ సమస్యలు సమగ్రంగా పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. రోగులు, సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యం పట్ల తాము చింతిస్తున్నామని, అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. 

స్టైపెండ్‌లను సకాలంలో విడుదల చేసేందుకు గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేయాలని, ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రికి కొత్త భవనం, వైద్యుల కోసం కొత్త హాస్టల్‌ భవనాలు నిర్మించాలని వారు డిమాండ్‌ చేశారు. సూపర్‌ స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెంట్స్‌ కోసం సవరించిన గౌరవ వేతనం ఇవ్వాలన్నారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)