Breaking News

ఒకే గడియారంలో 176 దేశాల సమయం…

Published on Mon, 01/26/2026 - 13:19

యాదాద్రి భువనగిరి జిల్లా: మనం ఇప్పటి వరకు మన దేశానికి సంబంధించిన 24 గంటల గడియారంను మాత్రమే చూశాం. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన పున్న మల్లేశం తన అద్భుతమైన ఆలోచనతో ఒకే సారి 176 దేశాలకు సంబంధించిన సమయాన్ని ఒకేదగ్గర చూసే విధంగా ప్రపంచ గడియారాన్ని ఆవిష్కరించాడు. గతంలో కలియుగ కేలండర్, కలియుగ పంచాంగాన్ని రూపొందించిన మల్లేశం తాజాగా ప్రపంచ గడియారంను తయారుచేసి తన నూతన ఆవిష్కరణలను కొనసాగిస్తున్నాడు. 

గతంలో కలియుగ కేలండర్‌.. 
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురంలో పున్న భారతమ్మ, పిచ్చయ్యలది సాధారణ చేనేత కుటుంబం. వారి మొదటి సంతానమైన మల్లేశం చేనేత వృత్తిలో రాణిస్తూనే బీఈడీ పూర్తి చేశాడు. ప్రస్తుతం హయత్‌నగర్‌లో మెడికల్‌షాప్‌ నిర్వహిస్తున్నాడు. విద్యార్థి దశనుంచే గణితంతోపాటు సామాజిక చైతన్యం, రచనా వ్యాసంగంలో ఆసక్తిగల మల్లేశం సాధారణ జీవనానికి భిన్నంగా సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేయాలనే తలంపుతో తన ఆలోచనలకు పదును పెట్టాడు. గతంలో కలియుగ కేలండర్‌ను, కలియుగ పంచాంగాన్ని ఆవిష్కరించి ప్రపంచానికి పరిచయం చేశాడు. మేధావుల ప్రశంసలు పొందాడు. 1,200 సంవత్సరాల ఐరిష్‌ కేలండర్‌ను ఆవిష్కరించి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించాడు. తాజాగా 176 దేశాలకు సంబంధించిన సమయాలను ఒకేసారి చూసే విధంగా ప్రపంచ గడియారాన్ని ఆవిష్కరించాడు. ఈ గడియారంలో చూపించే సమయం ఆధారంగా విదేశాల్లో ఉన్న తమ వారి పనులకు ఆటంకం కలగకుండా మాట్లాడటం వీలవుతుంది.  

భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలు  
ప్రపంచంలో ఎవరూ చేయని దాన్ని చేయాలనేది నా సంకల్పం. అదే సంకల్పంతో కలియుగ కేలండర్, కలియుగ పంచాంగాన్ని తయారు చేశాను. తాజాగా 176 దేశాలకు సంబంధించిన ప్రపంచ గడియారాన్ని ఆవిష్కరించాను. భవిష్యత్‌లో మరిన్ని కొత్తకొత్త ఆవిష్కరణలు చేయాలనేది నా కోరిక.                         
పున్న మల్లేశం ఆవిష్కర్త  

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు