Breaking News

వాళ్లందరిపైనా ఇలాగే చర్యలు తీసుకుంటారా?: స్మితా సబర్వాల్‌

Published on Sat, 04/19/2025 - 13:04

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్మాల్‌ శనివారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించిన ఆమె సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్టుకుగానూ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. 

ఇవాళ గచ్చిబౌలి పీఎస్‌లో ఆమె విచారణకు హాజరై స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఆపై తన ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. ‘‘చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చా. పోలీసులకు పూర్తిగా సహకరించా. నేను ఎలాంటి పోస్ట్‌ చేయలేదు. హాయ్‌ హైదరాబాద్‌ పోస్టును రీట్వీట్‌ చేశా.  2 వేల మంది అదే పోస్ట్‌ను షేర్‌ చేశారు. వాళ్లందరితోనూ ఇలాగే వ్యవహరిస్తారా?. 

.. ఇలాగే నోటీసులు ఇచ్చి వారందరిపై ఇలాగే చర్యలు తీసుకుంటారా?.  అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్‌ చేసినట్లు అవుతుంది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. ఇది ఎంత వరకు కరెక్ట్‌?. జస్టిస్‌ అనేది అందరికీ సమానంగా ఉండాలి. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్‌ చేస్తున్నారా?’’ అని అన్నారామె. 

ఇదిలా ఉంటే.. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో ఆమెకు ఈనెల 12నే నోటీసులు జారీ అయ్యాయి. కంచ గచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదంటూ వైరల్‌ అయిన నకిలీ ఫొటోలను ఆమె సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే నోటీసులు అందుకున్నాక కూడా ఆమె సోషల్‌ మీడియాలో చేసిన కొన్ని రీట్వీట్‌లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)