Breaking News

వామ్మో.. అప్పుడే భానుడి భ‌గ‌భ‌గ‌లు!

Published on Mon, 03/17/2025 - 17:09

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ‌ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణంకంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్‌ అధికంగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు (Temperatures) అధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు (Heat Wave) వీచే అవకాశముందని హెచ్చరించింది. 

ఆదివారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 40.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 19.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఆదిలాబాద్‌లో సాధారణం కంటే 3.4 డిగ్రీ సెల్సియస్‌ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 3 డిగ్రీల చొప్పున అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం చాలా ప్రాంతాల్లో 1 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. 

అధిక ఉష్ణోగ్ర‌త‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు ప్ర‌జ‌లు ఏసీలు, ఎయిర్ కూల‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంద‌ని అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉన్నందున్న‌.. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ఎండ‌లు పెర‌గ‌డంతో ఏపీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

మండుతున్న ఎండలు... బోసిపోయిన రోడ్లు
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా ప్రజలు రోడ్లపైకి రావడం తగ్గించారు. ఎండ వేడిమికి తోడు వడగాలులు కూడా వీస్తుండటంతో ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో సచివాలయం వద్ద రోడ్లు ఇలా బోసిపోయి కనిపించాయి. మ‌రో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు కొన‌సాగుతాయ‌ని వాతావరణ శాఖ వెల్ల‌డించిన నేప‌థ్యంలో భాగ్య‌న‌గ‌ర‌వాసులకు మ‌రింత ఉక్క‌పోత ఖాయంగా క‌నిపిస్తోంది. 

21 నుంచి రెండు రోజులపాటు వర్షాలు 
మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ నెల 21 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rain) కురుస్తాయని పేర్కొంది. గత కొద్దిరోజులుగా దంచికొడుతున్న ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

చ‌ద‌వండి: RRR వ‌ర‌కు హెచ్‌ఎండీఏ విస్తరణతో డీటీసీపీకి బ్రేక్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)