Breaking News

‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే

Published on Wed, 05/01/2024 - 16:17

సాక్షి, హైదరాబాద్‌: ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కేసులో సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై  పలువురు అధికారులు హైకోర్టు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై విజయసేన్ రెడ్డి బెంచ్‌ స్టే ఇచ్చింది.

10 మంది పోలీసు అధికారులు ఈ ఎన్‌కౌంట‌ర్‌ ఘటనలో పాల్గొన్నారని, వీరందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని గతంలో క‌మిష‌న్ తెలిపింది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహా రెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిపై ఐపీసీ 302, సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలని క‌మిష‌న్‌ తెలిపింది. ఈ నివేదికపై అప్పటి షాద్‌నగర్‌ సీఐ శ్రీధర్‌తో పాటు తహసీల్దార్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఎన్‌కౌంటర్‌ తర్వాత జరగాల్సిన ప్రొసిజర్స్‌లో లోపాలు ఉన్నాయన్న కమిషన్‌..‘దిశ’ నిందితులను ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారని  రిపోర్టు ఇచ్చింది. ఎన్‌కౌంటర్‌ వాడిన పిస్తోళ్ల వివరాలు కూడా సరిగ్గా లేవని నివేదికలో పేర్కొన్న కమిషన్‌.. అప్పటి ఎన్‌కౌంటర్‌ను పూర్తిగా తప్పుబట్టింది. కమిషన్‌ రిపోర్ట్‌పై ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)