డిజిటల్ వేదికలకు హైకోర్టు షాక్‌.. 200 వీడియోల తొలగింపు!

Published on Sun, 07/26/2026 - 12:43

హైదరాబాద్‌: లైంగిక దాడి బాధితురాలి గోప్యత, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేస్తూ, ఆమె ప్రాథమిక గోప్యతా హక్కును భంగపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో ఉన్న 200కు పైగా డిజిటల్ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఈ కేసులో విచారణ జరిపిన జస్టిస్ బి విజయ్‌సేన్ రెడ్డి, యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), ఎక్స్ (గతంలో ట్విట్టర్) సంస్థలకు మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్‌కు సంబంధించిన గుర్తింపును వెల్లడించే, గోప్యతకు భంగం కలిగించే అన్ని అభ్యంతరకర డిజిటల్ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

చట్టపరమైన విజ్ఞప్తులు చేసినప్పటికీ సోషల్ మీడియా దిగ్గజాలు స్పందించకపోవడంతో హైకోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు న్యాయవాది నాగుర్‌బాబు ఎన్ తెలిపారు. బాధితురాలి ఫొటోలు, వీడియోలు నిరంతరం ప్రసారం కావడం వల్ల ఆమె గౌరవానికి తీవ్ర భంగం కలుగుతోందని వాదించారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు మధ్యవర్తి సంస్థల గ్రీవెన్స్ అధికారులకు విన్నవించినా చర్యలు లేకపోవడంతో, రాజ్యాంగంలోని 14, 21 వ ఆర్టికల్స్, ఐటీ చట్టం-2000, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితురాలి హక్కులను రక్షించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

వాదనలు విన్న హైకోర్టు.. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు టెలికాం దిగ్గజాలకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న అనుబంధం-ఎ లోని 200కు పైగా యూట్యూబ్ వీడియోలు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ పోస్టులను తక్షణమే తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 20కి కోర్టు వాయిదా వేసింది.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)